India- USA Trade: భారత్ అభివృద్ది చెందిన దేశం, జీఎస్పి కింద వాణిజ్య ప్రయోజనాలను పొందే అర్హత ఈ దేశానికి లేదు, భారత్‌కు జీఎస్పీ రద్దు నిర్ణయాన్ని సమర్థించుకున్న అమెరికా
అంతకంటే ఎక్కువ ఉంటే ప్రయోజనాలు వర్తించవు. ఈ క్రమంలో భారత్ తో పాటు బ్రెజిల్, ఇండోనేషియా, హాంకాంగ్, దక్షిణాఫ్రికా మరియు అర్జెంటీనాతో తదితర దేశాలను జీఎస్పీ నుంచి యుఎస్‌టిఆర్ తొలగించింది....
Washington DC, February 13: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు (Donald Trump India Tour) కొన్ని రోజుల ముందు, భారతదేశాన్ని ఒక "అభివృద్ధి చెందిన దేశం" (Developed Nation) గా వర్గీకరిస్తూ జీఎస్పీ (GSP) రాయితీలు పొందేందుకు అర్హత లేదని యూఎస్ తేల్చేసింది. యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR) ప్రకారం, భారతదేశం ఎంతో బలమైన ఆర్థిక వ్యవస్థ గలది కాబట్టి ఈ దేశం ఇకపై ఎంతమాత్రం అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, ఎందుకంటే ఈ దేశం జి -20లో సభ్యత్వం కలిగి ఉంది మరియు ప్రపంచ వాణిజ్యంలో 0.5 శాతం లేదా అంతకంటే ఎక్కువ వాటాను దాటేసింది. ప్రపంచ ఎగుమతుల్లో భారతదేశం వాటా 2018 లో 1.67 శాతం, ప్రపంచ దిగుమతులు 2.57 శాతం అని పేర్కొంది.
దీని ప్రకారం ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా వర్గీకరిస్తూ, యుఎస్ ‘జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జిఎస్పి) పథకం కింద వాణిజ్య ప్రాధాన్యత ప్రయోజనాలు పొందే అర్హత నుంచి మినహాయింపునిచ్చింది. గత జూన్ వరకు భారత్ చేసే ఎగుమతులపై టాక్స్ లేని ప్రాధాన్యతను అమెరికా జీఎస్పి ద్వారా ఇచ్చింది. జాన్ 2019 నుంచి జీఎస్పీ అర్హతను ఇండియాకు రద్దు చేసింది. తాజాగా తన నిర్ణయాన్ని అమెరికా మరోసారి సమర్థించుకుంది. అమెరికా అధ్యక్షుడికి చిరస్మరణీయంగా గుర్తుండిపోయేలా భారీ స్వాగత ఏర్పాట్లు
అయితే భారతదేశానికి ఇతర దేశాల నుంచి జీఎస్పి లాంటి ఎలాంటి ప్రయోజనాలు అవసరం లేదని, సొంతంగా పోటీపడగల శక్తి ఉంది అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ చెప్తునప్పటికీ, ఈ వ్యవహారం మాత్రం ఇండియా- యూఎస్ మధ్య వాణిజ్య చర్చలలో భాగంగా కొనసాగుతోంది. భారత వ్యాపారులు మాత్రం అమెరికా ఇచ్చే జీఎస్పీని పునరుద్ధరించాలని కోరుకుంటున్నారు. ఈనెల చివరలో యూఎస్ ప్రెసిడెంట్ భారత పర్యటనతో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని వారు ఆశలు పెట్టుకున్నారు.
యూఎస్ పరిపాలన ప్రకారం, ప్రపంచ వాణిజ్యంలో 0.5 శాతం కంటే తక్కువ వాటా ఉన్న దేశం జీఎస్పి కింద ప్రయోజనాలను పొందవచ్చు. అంతకంటే ఎక్కువ ఉంటే ప్రయోజనాలు వర్తించవు. ఈ క్రమంలో భారత్ తో పాటు బ్రెజిల్, ఇండోనేషియా, హాంకాంగ్, దక్షిణాఫ్రికా మరియు అర్జెంటీనాతో తదితర దేశాలను జీఎస్పీ నుంచి యుఎస్‌టిఆర్ తొలగించింది.