New Delhi, February 12: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కలిసి ఈ ఫిబ్రవరి 24, 25 తేదీల్లో భారత్ లో పర్యటించనున్నారు. తమ రెండు రోజుల పర్యటనలో భాగంగా న్యూదిల్లీ మరియు అహ్మదాబాద్ నగరాలను వీరు సందర్శించనున్నారు.
ఈ నేపథ్యంలో ట్రంప్ కు ఘనమైన స్వాగతాన్ని పలికేందుకు మోదీ సర్కార్ ఏర్పాట్లు చేయనుంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో త్వరలో ప్రారంభం కానున్న ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం- మొటెరా స్టేడియంలో భారీ సభను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ వారికి ఆహ్వానం పలుకుతూ, తమరి రాక మాకేంతో ఆనందం, జీవితంలో ఎన్నడూ మరిచిపోలేని రీతిలో మీకు సుస్వాగతం పలికేందుకు భారతదేశం వేచి చూస్తుందంటూ పేర్కొన్నారు.
Here's PM Modi's Tweet:
Extremely delighted that @POTUS @realDonaldTrump and @FLOTUS will visit India on 24th and 25th February. India will accord a memorable welcome to our esteemed guests.
This visit is a very special one and it will go a long way in further cementing India-USA friendship.
— Narendra Modi (@narendramodi) February 12, 2020
అంతకుముందు తన భారత పర్యటన విశేషాలపై ట్రంప్ మాట్లాడుతూ " నేను త్వరలోనే ఇండియా వెళ్తున్నాను, "అతడు (మోదీ) నా ఫ్రెండ్, జెంటిల్మెన్ నా కోసం 50 నుంచి 70 లక్షల మందితో ఎయిర్ పోర్ట్ నుంచి నుంచి స్టేడియం వరకు స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. ఎందుకంటే 40 - 50 వేల మంది వస్తే నాకు అంతగా నచ్చదు, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో మా సమావేశం ఉండబోతుంది" అంటూ ఫన్నీగా వ్యాఖ్యానించారు.
గతంలో మోదీ అమెరికాలో పర్యటించినపుడు 'హోడీ- మోడీ' సభకు సుమారు 50 వేల మంది హాజరయ్యారు. ఒక విదేశీ నాయకుడి సభకు అమెరికాలో అంతపెద్ద ఎత్తున జనం రావడం అదే తొలిసారి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ సభను గుర్తు చేస్తూ పైవిధంగా సరదాగా స్పందించారు. వేలల్లో కాదు, మా వద్ద లక్షల్ల మంది ఉన్నారు, ఆ రకంగా స్వాగతం పలుకుతామని మోదీ చెప్పారని ట్రంప్ తెలియజేశారు.
ఇక మీ పర్యటన పట్ల భారత్- యూఎస్ మధ్య సంబంధాలు మరింత ధృడపడతాయని ఆకాంక్షిస్తున్నాం. దేశ ప్రజల సంక్షేమం విషయంలో ప్రజాస్వామ్య దేశాలైన యూఎస్ మరియు భారత్ ఒకే రకమైన ఆలోచన విధానాలు కలిగి ఉన్నాయి. ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య, తదితర సమస్యలు పరిష్కారం అవుతాయి. భారత్- యూఎస్ మధ్య ఉన్న బలమైన స్నేహం, ఇరు దేశాల పౌరులకు మాత్రమే కాకుండా, ఈ ప్రపంచానికి కూడా మేలు చేస్తుంది అని మోదీ అన్నారు. ట్రంప్ మనవాడే అంటున్న నరేంద్ర మోదీ
ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య మంచి స్నేహం ఉంది. ఎన్నో సందర్భాల్లో వీరిద్దరూ కలిశారు. గతేడాది 4 సార్లు వీరిరువురి భేటీ జరిగింది.