ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఉత్తర అమెరికాలోని హోస్టన్ సిటీలో "Howdy, Modi" పేరుతో భారీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ప్రవాస భారతీయులనుద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. 'Howdy' అనేది అమెరికాలో వాడుక పదం. సింపుల్ గా చెప్పాలంటే Howdy, Modi అంటే How dou you do Modi..? ఎలా ఉన్నారు మోదీ అని ఒక ఆత్మీయ పలకరింపు లాంటింది.
మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా (Live) వీక్షించేందుకు ఇప్పటికే 50 వేలకు పైగా మంది రిజస్టర్ అయ్యారు. సమావేశం దగ్గరపడే కొద్దీ ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
అయితే మోదీ సభకు ఇంత భారీగా మద్ధతు రావడం ఒక రికార్డు. గతంలో కూడా భారత ప్రధానులు అమెరికాలో సమావేశం నిర్వహించినప్పటికీ, ఈ స్థాయి స్పందన ఎప్పుడూ రాలేదు. ఉత్తర అమెరికాలో పోప్ ఫ్రాన్సిస్ నిర్వహించే సభలకు మినహా ఏ విదేశీ నాయకుడికి కూడా ఇంత భారీ సంఖ్యలో స్పందన రావడం ఇదే తొలిసారి అని చెప్తున్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 27న ఐరాస జనరల్ అసెంబ్లీ ఎన్నికలు అమెరికాలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో భారత ప్రధాని పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే వచ్చే నెలలో మోదీ అమెరికా పర్యటన ఖరారైంది. అయితే ఆ ఎన్నికలకు ముందుగానే మోదీ సభ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. టెక్సాస్ ఇండియా ఫోరమ్ (TIF) అధ్వర్యంలో హోస్టన్ లోని NRG స్టేడియం వేదికగా మోదీ సభ జరగనుంది. ఈ సభలో పాల్గొనటానికి ఎవరైనా ఈ ఆగష్టు 29 వరకు తమ పేరును నమోదు చేసుకోవచ్చు.
ఉత్తర అమెరికాలోని హోస్టన్ సిటీలో చాలా మంది ప్రవాస భారతీయులు నివాసముంటున్నారు. ఆ ఒక్క సిటీలోనే దాదాపు 1 లక్షా 30 వేలకు పైగా ప్రవాస భారతీయులున్నట్లు అధికారిక జనాభా లెక్కల ప్రకారం తెలుస్తుంది. మోదీ తన పర్యటనలో భాగంగా బడా పారిశ్రామిక వేత్తలు, నాయకులను కలుసుకోబోతున్నారు.
భారత ప్రధాని సమావేశం నేపథ్యంలో అమెరికా సెనెటర్ జాన్ కార్నిన్, వందలవేల భారతీయుల తరఫున, అమెరికా ప్రజల తరఫున హోస్టన్ సిటీ మీకు సాదర స్వాగతం పలుకుతుంది అంటూ తమ ఆహ్వానాన్ని పంపారు. నరేంద్ర మోదీ సభతో భారత్- అమెరికా సంబంధాలు మరింత బలపడతాయని, అమెరికాలో భారతీయులకు మరిన్ని మంచి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.