India-Myanmar Border Issue: మయన్మార్‌లో అంతర్యుద్ధం, మిజోరాంకు పారిపోయిన 184 మంది మయన్మార్ సైనికులను వెనక్కి పంపిన భారత్
సైన్యానికి, తిరుగుబాటు దళాలకు మధ్య భీకరపోరు కొనసాగుతోంది. మయన్మార్ సైనికులు ప్రాణాలు కాపాడుకునేందుకు సరిహద్దులు దాటి భారత్ లో ప్రవేశిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత వారం మిజోరాంకు పారిపోయిన 184 మంది మయన్మార్ సైనికులు తమ దేశానికి తిరిగి పంపించారని ఒక అధికారి మంగళవారం తెలిపారు.
Mizoram, Jan 23: మయన్మార్ లో ప్రస్తుతం అంతర్యుద్ధం జరుగుతోంది. సైన్యానికి, తిరుగుబాటు దళాలకు మధ్య భీకరపోరు కొనసాగుతోంది. మయన్మార్ సైనికులు ప్రాణాలు కాపాడుకునేందుకు సరిహద్దులు దాటి భారత్ లో ప్రవేశిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత వారం మిజోరాంకు ( Mizoram) పారిపోయిన 184 మంది మయన్మార్ సైనికులు (184 Myanmar soldiers) తమ దేశానికి తిరిగి పంపించారని ఒక అధికారి మంగళవారం తెలిపారు.
గత వారం మొత్తం 276 మంది మయన్మార్ సైనికులు మిజోరంలోకి ప్రవేశించగా, వారిలో 184 మందిని సోమవారం వెనక్కి పంపినట్లు అస్సాం రైఫిల్స్ అధికారి తెలిపారు. ఐజ్వాల్ సమీపంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయం నుంచి పొరుగు దేశంలోని రఖైన్ రాష్ట్రంలోని సిట్వేకు మయన్మార్ వైమానిక దళ విమానాల్లో వారిని తరలించినట్లు అధికారి తెలిపారు.
దంతెవాడలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి
మయన్మార్‌లో కొన్ని రోజులుగా ఆ దేశ సైన్యం, సాయుధ గ్రూపుల మధ్య ఘర్షణ తలెత్తడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే మయన్మార్ సైనికులు సరిహద్దులు దాటి భారత్‌లోకి చొరబడుతున్నారు. ఇప్పటి వరకు 276 మంది సైనికులు సరిహద్దు రాష్ట్రమైన మిజోరంలోకి వచ్చారు. వారిలో 184 మందిని స్వదేశానికి తిప్పి పంపినట్టు అధికారులు తెలిపారు.
మయన్మార్ ఎయిర్ ఫోర్సుకు చెందిన విమానంలో వారిని రెండు విధాలుగా పంపించినట్టు వెల్లడించారు. సైనికులు బయలుదేరే ముందు వారికి అవసరమైన అన్ని లాంఛనాలను అధికారులు పూర్తి చేశారు. మిగిలిన 92 మందిని కూడా మంగళవారం తరలించనున్నట్టు తెలుస్తోంది. మయన్మార్ జవాన్లను వెనక్కకి పంపేలా చూడాలని మిజోరం ప్రభుత్వం కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సైనికులను పంపిచండం గమనార్హం.
మయన్మార్‌లోని రఖైన్ ప్రావీన్సులో సాయుధ మిలిటెంట్లు ఆర్మీ శిబిరాలపై దాడి చేసి స్వాధీనం చేసుకున్న తర్వాత 276 మంది మయన్మార్ సైనికులు మిజోరంలోని లాంగ్ట్లై జిల్లాకు వచ్చి అక్కడే ఆశ్రయం పొందారు. దీంతో అప్రమత్తమైన మిజోరం సీఎం లాల్దూహోమా జనవరి 20 న షిల్లాంగ్‌లో జరిగిన ఈశాన్య కౌన్సిల్ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వద్ద ఈ సమస్యను ప్రస్తావించారు.మయన్మార్ సైనికులను వెనక్కి పంపించాలని కోరారు.
అసోంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐదు పోలీస్ కమాండో బెటాలియన్ల శిక్షణ పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మయన్మార్ నుంచి సరిహద్దులు దాటి దేశంలోకి ప్రవేశిస్తున్న వారిని అడ్డుకుంటామని తెలిపారు.
జమ్ము కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్, ఇద్దరు ఆర్మీ అధికారులతో పాటు ఇద్దరు సైనికులు మృతి
మయన్మార్ పౌరులు భారత్ లోకి యధేచ్ఛగా రాకపోకలు సాగించడంపై కేంద్రం పునరాలోచిస్తోందని వివరించారు. బంగ్లాదేశ్ తో సరిహద్దు విషయంలో ఎలా వ్యవహరిస్తున్నామో, మయన్మార్ సరిహద్దు వద్ద కూడా భద్రత ఏర్పాటు చేస్తామని చెప్పారు. 600 మంది మయన్మార్ సైనికులు సరిహద్దు రాష్ట్రం మిజోరంలోకి వచ్చారు. ఆశ్రయం కోసం మయన్మార్ సైనికులు వస్తున్న నేపథ్యంలోనే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై వ్యాఖ్యలు చేశారు.
మొత్తంగా గతేడాది నవంబర్ 13 నుంచి ఇప్పటి వరకు 636 మంది మయన్మార్ సైనికులు భారత్‌కు వచ్చినట్టు అధికారులు తెలిపారు. అంతకుముందు జనవరి 2, 9 తేదీల్లో 151 మంది మయన్మార్ మిలిటరీ విమానంలో స్వదేశానికి వెళ్లారు.
మయన్మార్ సైన్యం, ప్రజాస్వామ్య అనుకూల మిలీషియా మధ్య భీకర పోరు కారణంగా మయన్మార్ ప్రజలు సరిహద్దులు దాటనున్నారనే ఆందోళనతో భారత్- మయన్మార్ సరిహద్దు పొడవునా కంచె ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించింది. ప్రస్తుతం ఇరుదేశాలు ఫెన్సింగ్ లేకుండా 1,643 కి.మీ సరిహద్దును పంచుకుంటున్నాయి.అంతేగాక మయన్మార్‌తో ఫ్రీ మూవ్‌మెంట్ రెజీమ్ (ఎఫ్‌ఎంఆర్) ఒప్పందం చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం పునరాలోచిస్తోందని అమిత్ షా వెల్లడించారు.
ఫిబ్రవరి 2021 నుంచి మయన్మార్‌లో సైన్యం, సాయుధ గ్రూపుల మధ్య పోరు నడుస్తోంది.ఇప్పటికే పలు నగరాల్లోని సైనిక స్థావరాలను తిరుగుబాటు సంస్థలు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.