COVID19 in India: భారత్‌లో ఒక్కరోజులోనే అత్యధికంగా 6,654 పాజిటివ్ కేసులు నమోదు, దేశంలో 1.25 లక్షలు దాటిన కోవిడ్-19 బాధితుల సంఖ్య, 3720కు పెరిగిన కరోనా మరణాలు
దేశంలో 95 శాతానికి పైగా కేసులు మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, న్యూ దిల్లీ, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అనే 10 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని, అందులోనూ ముంబై, అహ్మదాబాద్, పుణె, దిల్లీ మరియు కోల్‌కతా లాంటి....
New Delhi, May 23: భారతదేశంలో కరోనా బాధితుల సంఖ్య లక్షా ఇరవైఐదు వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 6,654 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో ఒకరోజులో ఇంత పెద్దమొత్తంలో కేసులు రావడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య శనివారం ఉదయం నాటికి 1,25,101 కు చేరింది. నిన్న ఒక్కరోజే 137 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3720కు పెరిగింది.
నిన్న దేశవ్యాప్తంగా 3250 మంది కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 51,783 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 69,597 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
రాష్ట్రాల వారీగా కోవిడ్-19 కేసుల వివరాలు ఇలా ఉన్నాయి:
S. No. | Name of State / UT | Total Confirmed cases* | Cured/Discharged/Migrated | Deaths** |
1 | Andaman and Nicobar Islands | 33 | 33 | 0 |
2 | Andhra Pradesh | 2709 | 1763 | 55 |
3 | Arunachal Pradesh | 1 | 1 | 0 |
4 | Assam | 259 | 54 | 4 |
5 | Bihar | 2177 | 629 | 11 |
6 | Chandigarh | 218 | 178 | 3 |
7 | Chhattisgarh | 172 | 62 | 0 |
8 | Dadar Nagar Haveli | 1 | 0 | 0 |
9 | Delhi | 12319 | 5897 | 208 |
10 | Goa | 54 | 16 | 0 |
11 | Gujarat | 13268 | 5880 | 802 |
12 | Haryana | 1067 | 706 | 16 |
13 | Himachal Pradesh | 168 | 59 | 3 |
14 | Jammu and Kashmir | 1489 | 720 | 20 |
15 | Jharkhand | 308 | 136 | 3 |
16 | Karnataka | 1743 | 597 | 41 |
17 | Kerala | 732 | 512 | 4 |
18 | Ladakh | 44 | 43 | 0 |
19 | Madhya Pradesh | 6170 | 3089 | 272 |
20 | Maharashtra | 44582 | 12583 | 1517 |
21 | Manipur | 26 | 2 | 0 |
22 | Meghalaya | 14 | 12 | 1 |
23 | Mizoram | 1 | 1 | 0 |
24 | Odisha | 1189 | 436 | 7 |
25 | Puducherry | 26 | 10 | 0# |
26 | Punjab | 2029 | 1847 | 39 |
27 | Rajasthan | 6494 | 3680 | 153 |
28 | Tamil Nadu | 14753 | 7128 | 98 |
29 | Telengana | 1761 | 1043 | 45 |
30 | Tripura | 175 | 152 | 0 |
31 | Uttarakhand | 153 | 56 | 1 |
32 | Uttar Pradesh | 5735 | 3238 | 152 |
33 | West Bengal | 3332 | 1221 | 265 |
Cases being reassigned to states | 1899 | |||
Total# | 125101 | 51784 | 3720 |
దేశంలో 95 శాతానికి పైగా కేసులు మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, న్యూ దిల్లీ, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అనే 10 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని, అందులోనూ ముంబై, అహ్మదాబాద్, పుణె, దిల్లీ మరియు కోల్‌కతా లాంటి 5 నగరాల్లో దాదాపు 60 శాతం కేసులు ఉన్నట్లు కేంద్ర అధికారులు వెల్లడించారు. రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఓ క్రూరమైన జోక్, కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సోనియా గాంధీ
అయితే ఇప్పటికీ దేశంలో కరోనా తీవ్రతను చాలావరకు కట్టడి చేయగలిగామని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్త లాక్డౌన్ సహా భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించి కఠినమైన చర్యలు తీసుకోవడం వల్లనే కరోనా కేసులు తక్కువగా ఉన్నాయని, లాక్డౌన్ అమలు చేసి ఉండకపోయుంటే ఇప్పటివరకు దేశంలో కనీసంగా 14-29 లక్షల పాజిటివ్ కేసులు, 37,000-76,000 కరోనా మరణాలు నమోదయ్యేవని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రవీణ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు.