COVID19 in India: భారత్‌లో 1,73,763 దాటిన కోవిడ్-19 బాధితుల సంఖ్య, దేశవ్యాప్తంగా ఒక్కరోజులోనే సుమారు 8 వేల పాజిటివ్ కేసులు నమోదు, 11 వేలకు పైగా డిశ్చార్జ్, 4,971 కు పెరిగిన కరోనా మరణాలు
ఇక్కడ ఇప్పటివరకుపాజిటివ్ గా నిర్ధారింపబడిన కేసుల సంఖ్య 62,228కు చేరుకుంది. శుక్రవారం ఒకే రోజులోనే 116 మంది కోవిడ్ బాధితులు మరణించగా, కొత్తగా మరో 2,682 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి....
New Delhi, May 30: భారతదేశంలో కరోనావైరస్ విజృంభన కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 7,965 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో ఒకరోజులో ఇంత పెద్దమొత్తంలో కేసులు రావడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య శనివారం ఉదయం నాటికి 1,73,763 కు చేరింది. నిన్న ఒక్కరోజే 265 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,971కు పెరిగింది.
నిన్న దేశవ్యాప్తంగా 11,263 మంది కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 82369 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 86,422 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
#COVID19 India Update:
మహారాష్ట్రలో కరోనావైరస్ వ్యాప్తి అత్యంత తీవ్రంగా ఉంది. ఇక్కడ ఇప్పటివరకుపాజిటివ్ గా నిర్ధారింపబడిన కేసుల సంఖ్య 62,228కు చేరుకుంది. శుక్రవారం ఒకే రోజులోనే 116 మంది కోవిడ్ బాధితులు మరణించగా, కొత్తగా మరో 2,682 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర కరోనా మరణాల సంఖ్య శనివారం ఉదయం నాటికి 2,098 పెరగగా, ప్రస్తుతం మొత్తం కేసులలో 33,133 ఆక్టివ్ కేసులు ఉన్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.