Coronavirus in India: కరోనా నుంచి కోలుకున్న నెల తరువాత మళ్లీ పాజిటివ్, దేశంలో తాజాగా 66,999 మందికి కోవిడ్-19, భారత్‌లో 23,96,638కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య

దీంతో మొత్తం కేసుల సంఖ్య 23,96,638కు చేరింది. బుధవారం రికార్డు స్థాయిలో 942 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటి వరకు 47,033 మంది ప్రాణాలు (Coronavirus Deaths) కోల్పోయారు. కాగా అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో భారత్‌ యూకేను దాటేసి నాలుగో స్థానానికి ఎగబాకింది. భారత్‌లో ప్రస్తుతం 6,53,622 యాక్టివ్‌ కేసులు ఉండగా, 16,95,982 మంది డిశ్చార్జి అయ్యారు. దేశంలో కరోనా రికవరీ రేటు ( COVID-19 Recovery Rate) 70 శాతం ఉంది.

Coronavirus Cases in India (Photo Credits: PTI)

New Delhi, August 13: భారత్‌లో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 66,999 మంది కరోనా (Coronavirus in India)బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23,96,638కు చేరింది. బుధవారం రికార్డు స్థాయిలో 942 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటి వరకు 47,033 మంది ప్రాణాలు (Coronavirus Deaths) కోల్పోయారు. కాగా అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో భారత్‌ యూకేను దాటేసి నాలుగో స్థానానికి ఎగబాకింది. భారత్‌లో ప్రస్తుతం 6,53,622 యాక్టివ్‌ కేసులు ఉండగా, 16,95,982 మంది డిశ్చార్జి అయ్యారు. దేశంలో కరోనా రికవరీ రేటు ( COVID-19 Recovery Rate) 70 శాతం ఉంది.

బుధవారం 8,30,391 టెస్టులు చేయగా మొత్తం ఇప్పటి వరకు 2,68,45,688 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కాగా దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. ఆ రాష్ట్రంలో 5,48,313 కేసులు ఉండగా, 3,14,520 కేసులతో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 2,50,000 మందికి కరోనా సోకగా, కర్ణాటకలో ఈ సంఖ్య 1,82,354గా ఉంది. అలాగే 1,47,391 కేసులతో దేశ రాజధాని ఢిల్లీ అయిదో స్థానంలో ఉంది. బెయిలా..జైలా అంటూ జోకేసిన సీజేఐ బోబ్డే, ధ‌ర్మేంద్ర వాల్వే బెయిల్ పిటిషన్ విచారణ సంధర్భంగా సుప్రీంకోర్టులో నవ్వులు పండించిన చీఫ్ జ‌స్టిస్ శరద్ అరవింద్ బోబ్డే

అసోంలో గడిచిన 24 గంటల్లో 4,593 మంది కరోనావైరస్ బారినపడగా ఇప్పటివరకు వైరస్‌ బారినపడిన వారి సంఖ్య 69 వేలకు చేరిందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హిమంతా బిస్వాశర్మ తెలిపారు. 45,073 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి కాగా 23,762 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారని, 161 మంది మృతి చెందారని పేర్కొన్నారు. బుధవారం 1,43,109 మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్ష చేయగా 4,593 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు. అస్సాంలో 2,669 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 52,062 మందికి కోవిడ్‌ పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు.

దేశ రాజ‌ధాని ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో క‌రోనాకు చికిత్స‌పొంది, డిశ్చార్జ్ అయిన ఇద్దరు బాధితుల‌కు తిరిగి క‌రోనా సోకింది. దీనిపై ఆసుప‌త్రి నోడల్ అధికారి డాక్టర్ అజిత్ జైన్ మాట్లాడుతూ వీరిద్ద‌రూ మళ్లీ క‌రోనా బారిన ఎలా ప‌డ్డారో ఇంకా నిర్ధారించలేద‌న్నారు. దీనిపై ఆసుపత్రి బృందం విచార‌ణ చేస్తున్న‌ద‌న్నారు. శాంపిల్స్ సేక‌రించ‌డంలో ఏదైనా పొరపాటు జరిగి ఉండవచ్చని, క‌రోనా రిపోర్టుల‌లో త‌ప్పులు చోటు చేసుకుంటున్న ఉదంతాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ వైర‌స్ కఫం లేదా శ్లేష్మంలో 39 రోజుల వరకు జీవించగలద‌న్నారు. క‌రోనా సోకిన వ్య‌క్తికి చికిత్స అందించాక, అత‌నిలో ఇంకా ఇన్ఫెక్ష‌న్ ఉందా? అనే దానిపై ఖచ్చితమైన ఆధారాలు కనుగొనలేద‌ని కొందరు వైద్యులు అంటున్నారు.



సంబంధిత వార్తలు

Eknath Shinde: మహారాష్ట్ర సీఎం పదవిపై ఫిటింగ్ పెట్టిన ఏక్‌నాథ్ షిండే...సీట్లకు సీఎం పదవికి సంబంధం లేదని కామెంట్, ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని లేదని వెల్లడి

Bandi Sanjay: మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయి, సీఎం రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్న బండి సంజయ్...మోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని వెల్లడి

Assembly Election Result 2024: మ‌హారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ షురూ.. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీయే హవా.. కౌంటింగ్ కు సంబంధించి పూర్తి వివ‌రాలివే (లైవ్)

Assembly Election Result 2024: మ‌హారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ కు స‌ర్వం సిద్ధం, వ‌య‌నాడ్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి, కౌంటింగ్ కు సంబంధించి పూర్తి వివ‌రాలివే