India's COVID19 Update: భారత్‌లో మరోసారి రికార్డ్ స్థాయిలో 96 వేలకు పైబడి పాజిటివ్ కేసులు నమోదు, దేశంలో 45 లక్షలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, 76 వేలు దాటిన కరోనా మరణాలు

నిన్న ఒక్కరోజే 1,209 COVID మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 76,271కు పెరిగింది.....

Coronavirus in India (Photo Credits: IANS)

New Delhi, September 11: భారతదేశంలో ప్రతిరోజు నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసులు ఎప్పటికప్పుడు రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. ఒకరోజులో కొత్తగా నమోదయ్యే కేసులు లక్షకు చేరువగా నమోదవడం ఆందోళన కలిగిస్తుంది. ఈరోజు, రేపు అంటూ ఊరిస్తున్న కరోనా వ్యాక్సిన్ మళ్లీ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సందర్భంలో ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించకపోతే, వ్యాప్తిని నిలవరించడం సాధ్యం కాదని ప్రభుత్వ వర్గాలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాయి, అయినా ఎలాంటి మార్పు కనిపించడం లేదు. రోజురోజుకి కేసులు పెరుగుతున్నాయే తప్ప, తగ్గడం లేదు..

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో 96,551 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో ఒకరోజులో నమోదయిన పాజిటివ్ కేసుల సంఖ్యలో ఇదే అత్యధికం. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య శుక్రవారం ఉదయం నాటికి 45,62,415 కు చేరింది. నిన్న ఒక్కరోజే  1,209 COVID మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 76,271కు పెరిగింది.

గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో 70,881 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ఇప్పటివరకు 35,42,664 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 9,43,480 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

India's COVID19 Update:

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 77.6% ఉండగా, ప్రస్తుతం తీవ్రత  (యాక్టివ్ కేసులు) 20.7% శాతంగా ఉన్నాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు కేవలం 1.7% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇక సెప్టెంబర్ 10 వరకు దేశవ్యాప్తంగా 5,40,97,975 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 11,63,542 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇక  కరోనావైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న రాష్ట్రాలలో దేశంలోనే మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది, ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు పాజిటివ్ గా నిర్ధారించబడిన కేసులు 9.9 లక్షలు దాటాయి. నిన్నటివరకు మొత్తం కేసుల సంఖ్య 9,90,795గా ఉండగా, మరణాల సంఖ్య 28,282గా ఉంది.

మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5,37,687 కేసులు మరియు 4,702కరోనా మరణాలతో రెండో స్థానంలో ఉండగా, సమీపంలోనే  4,86,052 కేసులు మరియు 8,154 మరణాలతో తమిళనాడు మూడో స్థానంలో ఉంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif