IPL Auction 2025 Live

New Covid Strain: మార్చి నుంచి మే వరకు కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ విశ్వరూపం చూడవచ్చు, గతేడాది కరోనావైరస్ కూడా అప్పుడే సూపర్ స్ప్రెడర్ అయింది, దానికి A4 పేరు పెట్టామని తెలిపిన ఐజిఐబి డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్

పలు రాష్ట్రాలకు యూకె నుంచి వచ్చిన వారి భయం పట్టుకుంది. బ్రిటన్ నుంచి ఇండియాకు వచ్చిన వారి శాంపిల్స్ ఇప్పటికే ల్యాబ్ లకు పంపడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త కోవిడ్ స్ట్రెయిన్ పై ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజిఐబి) డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ (Genomics and Integrative Biology (IGIB) Director Anurag Agrawal) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Coronavirus Outbreak in India | Photo: IANS

New Delhi, Dec 26: యూకెలో కొత్త రూపాన్ని సంతరించుకుని ప్రపంచాన్ని వణికించేందుకు రెడీ అవుతున్న కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ (New Covid Strain) ఇప్పటికే ఇండియాలోకి ఎంటరయింది. పలు రాష్ట్రాలకు యూకె నుంచి వచ్చిన వారి భయం పట్టుకుంది. బ్రిటన్ నుంచి ఇండియాకు వచ్చిన వారి శాంపిల్స్ ఇప్పటికే ల్యాబ్ లకు పంపడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త కోవిడ్ స్ట్రెయిన్ పై ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజిఐబి) డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ (Genomics and Integrative Biology (IGIB) Director Anurag Agrawal) సంచలన వ్యాఖ్యలు చేశారు.

కొత్త కోవిడ్ 19 స్ట్రెయిన్ (new Coronaviurs variant) ఇండియాలో మార్చి నుంచి మే వరకు తన విశ్వరూపం చూపించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. గతేడాది చైనా నుంచి వచ్చిన వైరస్ కూడా మార్చి నుంచి మే మధ్యలోనే సూపర్ స్ప్రెడర్ గా మారిందని తెలిపారు. దానికి A4 అని పేరు పెట్టామని..అయితే ఇది జూన్ నాటికి క్షీణించిందని అన్నారు. ది ప్రింట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మార్చి మరియు మే మధ్య భారతదేశం పూర్తిగా ప్రత్యేకమైన కరోనావైరస్ వ్యాప్తికి గురైందని తెలిపారు. మార్చి-మేలో కోవిడ్ -19 కేసులు అనేక మెట్రో నగరాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఇది భారతదేశంలో సూపర్ స్ప్రెడర్ సంఘటనగా కనిపించిందని అన్నారు.

కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్‌పై మార్గదర్శకాలు విడుదల, యూకే నుంచి వచ్చిన ప్రయాణికులు తప్పనిసరిగా RT-PCR పరీక్షలు చేయించుకోవాలని సూచించిన కేంద్ర ఆరోగ్య శాఖ

ఈ A4 వేరియంట్ ( Covid 19 A4 Variant) ఆగ్నేయాసియాలో ప్రారంభమై సూపర్ స్ప్రెడర్ ఈవెంట్‌గా మారిందని ఆ కేసులు ఢిల్లీ, హైదరాబాద్ మరియు కర్ణాటకలో కూడా కనిపించాయి. ఏదేమైనా, జూన్ నాటికి ఇది మరణించింది.అయితే A4 ఫిట్ వైరస్ కాదు, ఎందుకంటే ఇది భారీగా పరివర్తన చెందింది మరియు అందువల్ల జూన్ నాటికి అది దానికదే స్వయంగా మరణించింది. ఇది స్వయంగా కదిలిపోతుందని ఊహించబడింది కాబట్టి అప్పుడు భయం లేదని అగర్వాల్ అన్నారు.

కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ ప్రమాదకరమా..? కరోనావైరస్ 2.0 అసలు పేరేంటి? కొత్త కోవిడ్ స్ట్రెయిన్ ఎప్పుడు..ఎక్కడ..ఎలా పుట్టింది? కోవిడ్ 2.0 గురించి పూర్తి సమాచారం

కాగా కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ (New Coronaviurs variant in India) నేపథ్యంలో యూకే పూర్తిగా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. అక్కడ కేసులో భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో యూకేకు అన్నిదేశాలు తమ రాకపోకలను నిలిపివేశాయి. భారత్‌తో సహా 40 కి పైగా దేశాలు యుకె నుండి విమానాలను నిలిపివేసాయి. రెండవ పరివర్తన కరోనావైరస్ తాజాగా దక్షిణాఫ్రికాలో కనుగొనబడిందని ఇది వేగంగా వ్యాప్తి చెందే అంటువ్యాధి అని నిపుణులు చెబుతున్నారు.

భారతదేశం ప్రస్తుతం పరిస్థితిని అంచనా వేస్తోంది మరియు ముందు జాగ్రత్త చర్యగా UK నుండి / UK నుండి అన్ని విమానాలను నిషేధించిందని అన్నారు. తగు జాగ్రత్తలతో కేంద్రం ముందుకెళుతుందని ఆయన చెప్పారు.