IAF's AN-32 Traced in Bay of Bengal: ఎనిమిదేళ్ల క్రితం అదృశ్యమైన ఏఎన్-32 విమాన శకలాలు గుర్గింపు, చెన్నై తీరానికి 310 కిలోమీటర్ల దూరంలో విమాన శకలాలు
చెన్నై తీరానికి 310 కిలోమీటర్ల దూరంలో విమాన శకలాలను గుర్తించారు.
IAF's AN-32 Aircraft traced in Bay of Bengal: దాదాపు ఎనిమిదేళ్ల కిందట 29 మందితో అదృశ్యమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)కు చెందిన విమాన శకలాలను తాజాగా గుర్తించారు. చెన్నై తీరానికి 310 కిలోమీటర్ల దూరంలో విమాన శకలాలను గుర్తించారు. చైన్నై సముద్ర తీరానికి 310 కి.మీ. దూరంలో సముద్ర మట్టానికి 3.4 కి.మీ. అడుగున నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (NIOT)కి చెందిన ఏయూవీ (నీటి అడుగున స్వయం చోదితంగా ప్రయాణించే వాహనం) సాయంతో భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కనుగొన్నట్లు తెలిపింది.
వాటి ఫొటోలను పరిశీలించిన తర్వాత ఐఏఎఫ్‌కు చెందిన ఏఎన్-32 విమానానికి చెందిన శకలాలుగా నిర్ధారించారు. బంగాళాఖాతంలోని ఆ ప్రాంతంలో ఏ విమానం కూలిన సంఘటనలు లేకపోవడంతో ఐఏఎఫ్ కే-2743 విమానం శకలాలుగా భావిస్తున్నట్లు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది.
దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన అటల్ సేతును ప్రారంభించిన ప్రధాని మోదీ, వీడియో ఇదిగో..
2016 జూలై 22న ఉదయం 8 గంటలకు ఐఏఎఫ్‌కు చెందిన ఆంటోనోవ్ ఏఎన్-32 రవాణా విమానం కే-2743 చెన్నైలోని తాంబరం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి టేకాఫ్ అయ్యింది. సిబ్బందితో సహా 29 మందితో వారాంతపు పర్యటన కోసం అండమాన్, నికోబార్ దీవులకు బయలుదేరింది.బంగాళాఖాతం సముద్రం మీదుగా ఎగిరిన ఐఏఎఫ్ విమానం కొంత సేపటికి అదృశ్యమైంది. అంతకు 16 నిమిషాల ముందు వరకు ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌తో కమ్యూనికేషన్‌లో ఉండి ఒక్కసారిగా అదృశ్యం కావడంతో వాయుసేన పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది.
Here's ANI News
రాడార్‌తో సంబంధాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆ విమానం కోసం సైనిక దళాలు మూడు నెలలపాటు విస్తృతంగా బంగాళాఖాతంలో సెర్చ్ చేశాయి. ఫలితం లేకపోవడంతో ఆ విమానంలోని 29 మంది మరణించి ఉంటారని ఐఏఎఫ్ ప్రకటించింది. 2016 సెప్టెంబర్ 15న ఈ మేరకు ఆయా కుటుంబాలకు లేఖలు పంపింది.ఈ విమానం పోర్ట్ బ్లెయిర్‌లోని భారత నౌకాదళ ఎయిర్ స్టేషన్ ఐఎన్‌ఎస్ ఉత్క్రోష్‌లో విమానం ల్యాండ్ కావాల్సి ఉంది.