PM Narendra Modi Inaugurates Mumbai Trans Harbour Link, India's Longest Sea Bridge

Mumbai, Jan 12: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని నిర్మించిన దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘అటల్‌ సేతు’ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ప్రారంభించారు. దీనినే ముంబై ట్రాన్స్‌హార్బర్‌ లింక్‌ అని కూడా పిలుస్తున్నారు. ముంబైలో దాదాపు రూ. 20 వేల కోట్ల వ్యయంతో ఆరు లేన్లుగా నిర్మించిన  'అటల్ బిహారి వాజ్‌పేయి సెవ్రి- న్వశేవ అటల్ సేతు' బ్రిడ్జిని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.భారతదేశంలోనే అతి పొడవైన వంతెన మరియు దేశంలోనే అతి పొడవైన సముద్ర వంతెన ఇది.

అరేబియా సముద్రంలో 10 యుద్ధనౌకలను మోహరించిన భారత్, శత్రువుల గుండెల్లో పరిగెడుతున్న రైళ్లు

ఇది ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మరియు నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తుంది. ముంబై నుండి పూణే, గోవా మరియు దక్షిణ భారతదేశానికి ప్రయాణ సమయాన్ని కూడా తగ్గిస్తుంది. అటల్‌ సేతు మొత్తం పొడువు 22 కిలోమీటర్లు. 16.5 కిలోమీటర్ల మేర అరేబియా సముంద్రంపై.. 5.5 కిలో మీటర్ల భూభాగంపై నిర్మించారు. రూ.17,840 కోట్ల వ్యయంతో నిర్మించిన 21.8 కిలోమీటర్ల సిక్స్ లేన్ బ్రిడ్జి ఇది. రాష్ట్రంలో రూ.30,500 కోట్లకు పైగా విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ప్రధాని మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు.

Here's ANI Video

భూకంపాలను సైతం తట్టుకొనేలా దీని నిర్మాణంలో అధునాతన సాంకేతికతతో నిర్మించారు.ఈ బ్రిడ్జిపై టోల్‌ ఫీజు ఒకవైపు రూ. 250 వసూలు చేయనున్నారు. అటల్‌ సేతు వంతెన ద్వారా కేవలం 20 నిమిషాల్లోనే ముంబై నుంచి నవీ ముంబైకు చేరుకోవచ్చు. గతంలో ముంబై నుంచి నవీ ముంబైకి రెండు గంటల సమయం పట్టేది.ఫ్లెమింగో పక్షుల కోసం బ్రిడ్జ్‌కు ఒకవైపు సౌండ్‌ బారియర్‌ ఏర్పాటు చేశారు.

జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నాసిక్‌లోని తపోవన్ గ్రౌండ్‌లో జరిగిన రాష్ట్రీయ యువ మహోత్సవ్‌ను ప్రధాని మోదీ ఈ సందర్భంగా ప్రారంభించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈరోజు నుంచి 16వ తేదీ వరకూ ఏటా జాతీయ యువజన ఉత్సవాలను దేశమంతటా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మహారాష్ట్ర ఈ ఉత్సవాలకు ఆతిథ్యం ఇస్తోంది.