COVID-19 in Indian Army: ఇండియన్ ఆర్మీలో 24 మందికి కరోనా పాజిటివ్, ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న సైనిక దళాలకు సోకిన వైరస్
ఎవ్వరినీ వదలడం లేదు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని (Delhi) ఆర్మీ హాస్పిటల్‌లో 24 మందికి కరోనా పాజిటివ్ (Coronavirus in Indian Army) వచ్చింది. ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న, రిటైర్ అయిన వారికి కూడా వైరస్ సంక్రమించింది. ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్‌లో (Research and Referral Hospital) పనిచేస్తున్న సైనిక దళాలకు వైరస్ సోకినట్లు నిర్దారించారు. అయితే వైరస్ సోకిన వారందర్నీ.. ఢిల్లీ కంటోన్మెంట్‌లో ఉన్న ఆర్మీ బేస్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఇప్పటి వరకు కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ జరగలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.
New Delhi, May 5: దేశ వ్యాప్తంగా కరోనావైరస్ వణికిస్తోంది. ఎవ్వరినీ వదలడం లేదు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని (Delhi) ఆర్మీ హాస్పిటల్‌లో 24 మందికి కరోనా పాజిటివ్ (Coronavirus in Indian Army) వచ్చింది. ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న, రిటైర్ అయిన వారికి కూడా వైరస్ సంక్రమించింది. ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్‌లో (Research and Referral Hospital) పనిచేస్తున్న సైనిక దళాలకు వైరస్ సోకినట్లు నిర్దారించారు. అయితే వైరస్ సోకిన వారందర్నీ.. ఢిల్లీ కంటోన్మెంట్‌లో ఉన్న ఆర్మీ బేస్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఇప్పటి వరకు కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ జరగలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఇండియన్ ఆర్మీలో 8 మందికి కరోనా, చికిత్స తీసుకుంటున్న నలుగురు జవాన్లు, లడక్ సెక్టార్‌లో కోవిడ్-19 నుంచి కోలుకున్న జవాన్, వెల్లడించిన ఆర్మీ చీఫ్ నారావణే
ఆర్మీలో ఇప్పటివరకు ఎనిమిది సానుకూల కేసులు ఉన్నాయని భారత సైన్యం అంతకుముందు ఏప్రిల్‌లో తెలియజేసింది. ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే మాట్లాడుతూ, "ఎనిమిది సానుకూల కేసులలో, ఇద్దరు వైద్యులు మరియు ఒకరు నర్సింగ్ అసిస్టెంట్. చికిత్సకు నలుగురు వ్యక్తులు చికిత్సకు సహకరిస్తున్నారని తెలిపారు. అలాగే లడఖ్‌లోని కరోనావైరస్ రోగి ఇప్పుడు కోలుకున్నారని, విధుల్లో కూడా చేరినట్లు నరవణే తెలిపారు.
ఇదిలా ఉంటే కేంద్ర న్యాయశాఖకు చెందిన ఓ సీనియర్ అధికారికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. దీంతో పలు మంత్రిత్వ శాఖలకు నిలయమైన శాస్త్రి భవన్‌లో కొంత భాగాన్ని సీల్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. కాగా సదరు అధికారి గత నెల 23న శాస్త్రి భవన్ నాలుగో అంతస్తులోని తన కార్యాలయాన్ని సందర్శించారనీ.. మే 1న ఆయనకు కొవిడ్-19 పాజిటివ్ ఉన్నట్టు తేలిందని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. ప్రొటోకాల్ ప్రకారం ఆయన ఎవరెవరిని కలిశారో గుర్తిస్తున్నామన్నారు.
మరోవైపు శాస్త్రి భవన్ గేట్ 1 నుంచి గేట్ నెంబర్ 3 వరకు నాలుగో అంతస్తు ‘‘ఎ’’ వింగ్ మొత్తం సీల్ చేసి శానిటైజ్ చేస్తున్నారు. లుటియన్స్ జోన్‌లో ఓ ప్రభుత్వ కార్యాలయాన్ని ఇలా సీల్ చేయాల్సి రావడం ఇది రెండోసారి. గత నెలలో ఓ సీనియర్ అధికారికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు గుర్తించడంతో నీతి ఆయోగ్ భవనాన్ని సీల్ చేశారు. ఇప్పటికే ఢిల్లీలోని బీఎస్ఎఫ్ ఆఫీసు కార్యాలయం కూడా కరోనా దెబ్బకు మూతపడింది.