Pakistan Quadcopter: భారత్ మీద బాంబు దాడికి చైనాతో కలిసి పాకిస్తాన్ ప్రయత్నం, అప్రమత్తమైన ఇండియన్ ఆర్మీ, పాక్ క్వాడ్‌కాప్టర్‌‌ను మట్టుబెట్టిన భారత సైన్యం

పొరుగు దేశం చైనాతో క‌లిసి బాంబుల దాడికి ప్ర‌య‌త్నించ‌గా, భార‌త సైన్యం (Indian Army) అప్రమత్తమై మ‌ట్టుబెట్టింది. జ‌మ్ముక‌శ్మీర్‌లో కేర‌న్ సెక్టార్‌లోని ( Jammu and Kashmir's Keran Sector) నియంత్ర‌ణ రేఖ (ఎల్‌వోసీ )వ‌ద్ద పాకిస్తాన్ ఆర్మీకి చెందిన క్వాడ్‌కాప్టర్‌ను (Pakistan Quadcopter) భార‌త సైన్యం మ‌ట్టుబెట్టింది. ఈ ఉద‌యం 8 గంట‌ల‌కు జ‌మ్ముక‌శ్మీర్ ల‌క్ష్యంగా బాంబుల దాడికి పాక్ కుట్ర ప‌న్నింది. ఈ క్వాడ్‌కాప్టర్ చైనా కంపెనీకి చెందిన డిజెఐ మావిక్ 2 ప్రో మోడల్‌గా భార‌త సైన్యం గుర్తించింది.

Pakistan Quadcopter (Photo-ANI)

New Delhi, Oct 24: దాయాది దేశం పాకిస్తాన్ మ‌రోసారి త‌న దుర్భుద్ధిని ప్ర‌ద‌ర్శించింది. పొరుగు దేశం చైనాతో క‌లిసి బాంబుల దాడికి ప్ర‌య‌త్నించ‌గా, భార‌త సైన్యం (Indian Army) అప్రమత్తమై మ‌ట్టుబెట్టింది. జ‌మ్ముక‌శ్మీర్‌లో కేర‌న్ సెక్టార్‌లోని ( Jammu and Kashmir's Keran Sector) నియంత్ర‌ణ రేఖ (ఎల్‌వోసీ )వ‌ద్ద పాకిస్తాన్ ఆర్మీకి చెందిన క్వాడ్‌కాప్టర్‌ను (Pakistan Quadcopter) భార‌త సైన్యం మ‌ట్టుబెట్టింది. ఈ ఉద‌యం 8 గంట‌ల‌కు జ‌మ్ముక‌శ్మీర్ ల‌క్ష్యంగా బాంబుల దాడికి పాక్ కుట్ర ప‌న్నింది. ఈ క్వాడ్‌కాప్టర్ చైనా కంపెనీకి చెందిన డిజెఐ మావిక్ 2 ప్రో మోడల్‌గా భార‌త సైన్యం గుర్తించింది.

ఈ విషయం ఇలా ఉండగానే.. రాజ‌స్థాన్‌లో పాకిస్తాన్ గూఢ‌చారి అరెస్టు అయ్యాడు. గూఢ‌చారిని రాజ‌స్థాన్‌లోని బాడ్మేర్‌లో అదుపులోకి తీసుకున్న‌ట్లు సీబీ-సీఐడీ అధికారులు తెలిపారు. భార‌త సైన్యం స‌మాచారాన్ని పాకిస్తాన్‌కు చేర‌వేస్తున్న‌ట్లు గుర్తించారు. స‌రిహ‌ద్దుల్లో వేత‌న కార్మికుడిగా ప‌ని చేస్తూ గూఢ‌చ‌ర్యానికి నిందితుడు పాల్ప‌డుతున్నాడు. నిందితుడిని విచార‌ణ నిమిత్తం జైపూర్ త‌ర‌లించిన‌ట్లు రాజ‌స్థాన్ పోలీసు ఏడీజీ(ఇంటెలిజెన్స్‌) ఉమేశ్ మిశ్రా తెలిపారు.

ANI Update:

భారతదేశంలోకి ఉగ్రవాదుల్లోకి చొరబడటానికి ఇస్లామాబాద్ తన శక్తిని కొనసాగించడానికి ప్రయత్నిస్తోందని, అయితే అప్రమత్తమైన భారత దళాలు అన్ని ప్రయత్నాలను అడ్డుకుంటున్నాయని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నారావణే ఇటీవల పేర్కొన్నారు. "శీతాకాలం ప్రారంభానికి ముందు వీలైనంత ఎక్కువ మంది ఉగ్రవాదులను దేశంలోకి పంపివేసే దుర్మార్గపు ఇంకా పాకిస్తాన్ వదిలిపెట్టడం లేదని అన్నారు.

ఎవరీ నూతన సైన్యాధిపతి మనోజ్‌ ముకుంద్‌?, ఆర్మీ చీఫ్ కాకముందు ఆయన ఏం విధులు నిర్వర్తించారు, సరిహద్దు వివాదాలను పరిష్కరించడంలో ఆయన పాత్ర ఏంటీ ? కొత్త ఆర్మీ చీఫ్‌పై విశ్లేషణాత్మక కథనం

ఏది ఏమయినప్పటికీ ఉగ్రవాదులను దేశంలోకి చొరబడకుండా, చొరబడినా వారిని ఏరివేసేందుకు భారత సైన్యం ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటుందని నరవణే తెలిపారు. అయితే కఠినమైన శీతాకాల పరిస్థితులు మరియు తరువాత హిమపాతం సరిహద్దులో సాధ్యమయ్యే మార్గాలను మూసివేసే ముందు పాకిస్తాన్ తీవ్రవాదులను దేశంలోకి నెట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని సత్యమని అన్నారు.