India's GDP Grows 7.8 Percent: అంచనాలను మించి భారత జీడీపీ 8.2 శాతం వృద్ధి నమోదు, ఇదే జోరు కొనసాగితే 5 ట్రిలియన్ డాలర్లకు భారత ఆర్థిక వ్యవస్థ
2023-24 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో అంచనాలు మించి జీడీపీ 7.8 శాతం నమోదైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ 8.2 శాతానికి పెరిగింది.
దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కీలకమైన జీడీపీ (GDP) గణాంకాలు వెలువడ్డాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో అంచనాలు మించి జీడీపీ 7.8 శాతం నమోదైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ 8.2 శాతానికి పెరిగింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికం 8.6 శాతంతో పోలిస్తే కాస్త తక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే జోరు కొనసాగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
శుక్రవారం ఎన్ఎస్ఓ విడుదల చేసిన డేటా ప్రకారం, రంగాల వారీగా విశ్లేషిస్తే రియల్ గ్రాస్ వ్యాల్యూ 2022-23 ఆర్థిక సంవత్సరంలోని 6.7 శాతంతో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతానికి పెరిగింది. ఈ వృద్ధి భారత ఆర్థిక వ్యవస్థను 3.5 ట్రిలియన్ డాలర్ల వైపు నడిపించింది. రానున్న కొన్నేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడానికి ఇది ఉపకరిస్తుందని భావిస్తున్నారు. దేశంలో తగ్గిపోతున్న హిందూ జనాబా, పెరుగుతున్న ముస్లిం జనాభా, సంచలన నివేదికను బయటపెట్టిన పీఎం ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్
2022-23 ఆర్థిక సంవత్సరంలో జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ జీడీపీ 6.2 శాతంగా నమోదైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి 7 శాతం వృద్ధి రేటు నమోదైంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 5.63 శాతంగా నమోదైంది. వాస్తవానికి బడ్జెట్‌లో 5.8 శాతంగా నమోదు కావొచ్చునని అంచనా వేశారు. వాస్తవ రూపంలో చూసినప్పుడు ఆదాయం, వ్యయం మధ్య వ్యత్యాసం రూ.16.53 లక్షల కోట్లుగా ఉన్నట్లు అధికార గణాంకాలు వెల్లడించాయి. స్థూలంగా పన్నుల రూపంలో రూ.23.26 లక్షల కోట్లు ప్రభుత్వానికి రాగా వ్యయం రూ.44.42 లక్షల కోట్లుగా ఉంది.
దేశం వార్షికాదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే దాన్ని ద్రవ్యలోటు అంటారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 5.63గా నమోదైంది. వాస్తవానికి బడ్జెట్‌లో 5.8 శాతంగా నమోదుకావొచ్చని అంచనా వేశారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది తొలి మూడు నెలల్లో పొరుగుదేశమైన చైనా 5.3 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది.
అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్ధ ఒడిదుడుకులకు లోనైనా భారత్ నిలకడైన వృద్ధి రేటు నమోదు చేయడం గమనార్హం. తయారీ రంగం ప్రోత్సాహకర వృద్ధి నమోదు చేయడంతో మెరుగైన జీడీపీ గణాంకాలు సాధ్యమయ్యాయని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. 2023-24లో తయారీ రంగం ఏకంగా 9.9 శాతం వృద్ధి చెందింది. అంతర్జాతీయ అనిశ్చితి పరిస్ధితులు, సవాళ్లు ఎదురైనా మన ఆర్ధిక వ్యవస్ధ పునరుత్తేజంతో ఉరకలెత్తిందని పేర్కొంది.