Indian Navy Rescues 19 Pakistan Nationals: శత్రువులకు దడపుట్టిస్తున్న భారత యుధ్దనౌక ఐఎన్ఎస్ సుమిత్ర, రెండో రోజుల్లోనే మరో రెస్కూ ఆపరేషన్, 19 మంది పాకిస్థానీలను రక్షించిన ఇండియన్ నేవీ
కొచ్చికి సుమారు 800 మైళ్ల దూరంలో పైరెట్స్ ఆధీనంలో ఉన్న ఇరానీ నౌకను, అందులో హైజాక్ అయిన 19 మంది పాకిస్థానీ నావికులను (INS Sumitra Safely Rescues 19 Pakistani Nationals) రక్షించింది.
INS Sumitra Safely Rescues 19 Pakistani Nationals: భారత నౌకాదళం(Indian Navy) రెండు రోజుల్లోనే మరో భారీ ఆపరేషన్ చేపట్టింది. కొచ్చికి సుమారు 800 మైళ్ల దూరంలో పైరెట్స్ ఆధీనంలో ఉన్న ఇరానీ నౌకను, అందులో హైజాక్ అయిన 19 మంది పాకిస్థానీ నావికులను (INS Sumitra Safely Rescues 19 Pakistani Nationals) రక్షించింది.
యుద్ధ నౌక ఐఎన్ఎస్ సుమిత్ర ఆ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. అందర్నీ రక్షించినట్లు (Indian Navy Rescues 19 Pakistan Nationals) ఇండియన్ నేవీ ప్రకటించింది. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో ఇండియన్ నేవీకి చెందిన మెరైన్ కమాండోలు పాల్గొన్నారు. హిందూ మహాసముద్రం ప్రాంతంలో భారతీయ యుద్ధ నౌకలు ఎప్పుడూ అలర్ట్‌గా ఉంటున్నాయని రక్షణ అధికారులు తెలిపారు.
కాగా కొన్ని రోజుల క్రితమే ఇఆర్‌కు చెందిన ఫిషింగ్ నౌక ఇమాన్‌ను పైరేట్స్ పట్టుకున్నారు.అప్పుడు కూడా ఐఎన్ఎస్ సుమిత్ర రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. తాజాగా ఇరాన్ జెండా ఉన్న అల్ నహీమ్ నౌకను కూడా పైరేట్స్ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ బోటులో 19 మంది పాకిస్థాన్ సెయిలర్లు ఉన్నారు.
Here's Updates
సుమిత్ర యుద్ధ నౌక రెస్క్యూ ఆపరేషన్ ద్వారా అందర్నీ రక్షించారు. కాగా సొమాలియా తూర్పు తీరంతో పాటు గల్ఫ్ ఆఫ్ ఎడన్‌లో యాంటీ పైరసీ, మారిటైం సెక్యూర్టీ ఆపరేషన్స్, పెట్రోలింగ్ కోసం యుద్ధ నౌక ఐఎన్ఎస్ సుమిత్రను భారతీయ నౌకాదళం మోహరించింది.