Indian Railways Restart: రేపట్నించి తిరిగి ప్రారంభం కానున్న ప్యాసెంజర్ రైలు సర్వీసులు, ఈరోజు నుంచే బుకింగ్స్ ప్రారంభం, ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌ బుకింగ్‌కు మాత్రమే అనుమతి

ఈ ప్రత్యేక రైళ్లు న్యూఢిల్లీ స్టేషన్ నుండి దిబ్రుగర్, అగర్తాలా, హౌరా, పాట్నా, బిలాస్‌పూర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మాడ్గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్ మరియు...

Image of Indian Railways |(Photo Credits: Flickr)

New Delhi, May 11: కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా సుమారు యాభై రోజులుగా ప్రజా రవాణా స్తంభించిపోయింది. అయితే ఎట్టకేలకు మే 12 నుంచి ప్యాసింజర్ రైలు సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. రేపట్నించి దశల వారీగా ప్యాసెంజర్ రైళ్లను క్రమంగా నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. తొలి దశలో న్యూఢిల్లీ నుంచి 15 రైలు సర్వీసులు దేశంలోని ముఖ్య పట్టణాలకు రాకపోకలు సాగించనున్నాయి. ఇందుకోసం కేవలం ఆన్‌లైన్‌లో బుకింగ్స్ కు మాత్రమే అనుమతించనున్నారు. ఈరోజు (మే 11) నుంచి ఐఆర్‌సిటిసి (irctic.co.in) వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, సాయంత్రం 4 గంటల నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి.

రైల్వే స్టేషన్లలో టికెట్ బుకింగ్ కౌంటర్లు మూసివేయబడే ఉంటాయి. ప్లాట్ఫాం టిక్కెట్లతో సహా ఎలాంటి కౌంటర్ టికెట్లు జారీ చేయబడవు అని రైల్వే శాఖ తెలిపింది. అంతేకాకుండా టికెట్ కలిగిన వ్యక్తిని మాత్రమే స్టేషన్ లోకి అనుమతిస్తారు. ముఖానికి మాస్క్ తప్పనిసరిగా వేసుకోవాలి, బయలుదేరేటప్పుడు ప్రతి ఒక్క ప్రయాణికుడు స్క్రీనింగ్ చేయించుకోవాలి, కరోనా లక్షణాలు లేని ప్రయాణికులు మాత్రమే అనుమతించబడతారు అని రైల్వే అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Notification Issued by Indian Railways:

ఈ ప్రత్యేక రైళ్లు న్యూఢిల్లీ స్టేషన్ నుండి దిబ్రుగర్, అగర్తాలా, హౌరా, పాట్నా, బిలాస్‌పూర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మాడ్గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్ మరియు జమ్మూ తవీ తదితర ప్రాంతాలను కలుపుతూ రానుపోను సర్వీసులు నడవనున్నాయి.

మెల్లిమెల్లిగా రైల్వే కోచ్‌ల లభ్యతను బట్టి రైళ్ల సంఖ్యను పెంచుతూ మరిన్ని మార్గాలలో నడుపుతామని భారతీయ రైల్వే తెలిపింది. ప్రస్తుతం సుమారు 20,000 బోగీలను కోవిడ్-19 సంరక్షణ కేంద్రాలుగా రిజర్వ్ చేయబడ్డాయి. వీటితో పాటు ప్రతిరోజు వలస కార్మికులను చేరవేసేందుకు 300 ప్రత్యేక శ్రామిక్ రైళ్లను ఇండియన్ రైల్వేస్ నడుపుతుంది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

IFS Officer Dies by Suicide: డిప్రెషన్‌లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన

Revanth Reddy Delhi Tour: ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై అధిష్టానంతో చర్చ,ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొననున్న రేవంత్

Special Trains For Holi: హోలీ పండుగ కోసం స్పెషల్ ట్రైన్స్‌, దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న ట్రైన్లు ఎక్కడెక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయో చూడండి

Rules Change In Railways: వెయిటింగ్‌ లిస్ట్‌ ప్రయాణికులకు జనరల్‌ బోగీల్లోనే ప్రయాణించాలి.. ఏసీ, స్లీపర్‌ బోగీల్లో ప్రయాణిస్తే జరిమానా.. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన రైల్వే కొత్త నిబంధనలు

Advertisement
Advertisement
Share Now
Advertisement