INS Sindhudhvaj: అగ్రజా సెలవంటూ వెళ్లిపోయావా... ఏకధాటిగా 45 రోజుల పాటు సముద్రంలో పహారా, నౌకా దళం నుండి నిష్క్రమించిన సింధు ధ్వజ్‌ సబ్‌మెరైన్‌, ఐఎన్‌ఎస్‌ సింధు ధ్వజ్‌‌పై ప్రత్యేక కథనం

పదేళ్ల క్రితమే దీని పనైపోయిందని విమర్శలు చేసినా దేశ రక్షణ కోసం పడి లేచిన ప్రతిసారి తన సత్తా చాటింది.

Decommissioning of INS Sindhudhvaj

New Delhi, July 21: భారత నేవీ దళంలో 35 ఏళ్లు సేవలందించిన సింధు ధ్వజ్‌ సబ్‌మెరైన్‌ (INS Sindhudhvaj) తూర్పు నౌకా దళం నుండి నిష్క్రమించింది. పదేళ్ల క్రితమే దీని పనైపోయిందని విమర్శలు చేసినా దేశ రక్షణ కోసం పడి లేచిన ప్రతిసారి తన సత్తా చాటింది. సముద్రంలో చిక్కుకున్న సబ్‌ మెరైన్లలోని సైనికుల్ని కాపాడే అనేక జలాంతర్గాములకు (Indian Powerful submarine) దిక్సూచిగా నిలిచిన సింధు ధ్వజ్‌ ఇక సెలవు (INS Sindhudhvaj retired after 35 years)అంటూ వెళ్లిపోయింది. ఏకధాటిగా 45 రోజుల పాటు సాగర గర్భంలో శత్రువులను రానీయకుండా పహారా కాసిన సబ్‌మెరైన్‌ గురించి ప్రత్యేక కథనం.

ప్రపంచంలోనే అత్యంత సాధారణ సంప్రదాయ జలాంతర్గామిగా ఐఎన్‌ఎస్‌ సింధు ధ్వజ్‌ని చెబుతారు. కిలో క్లాస్‌ సబ్‌మెరైన్‌గా (Kilo-class boats) పరిగణించే ఈ జలాంతర్గామి భారత నౌకాదళం ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా తయారు చేస్తున్న ప్రతి సబ్‌మెరైన్‌ డిజైన్‌ కి స్ఫూర్తిగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. 35 ఏళ్ల క్రితం రష్యా నుంచి కొనుగోలు చేసిన ఈ సబ్ మెరైన్ భారత్ నావికా దళంలో చేరిన తర్వాత దుమ్మురేపింది. స్వదేశీ సోనార్, స్వదేశీ శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్‌తో పాటు స్వదేశీ టార్పెడో ఫైర్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ ద్వారా తన సామర్థ్యాన్ని మరింత పెంపొందించుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇన్నోవేషన్‌ ఫర్‌ చీఫ్‌ ఆఫ్‌ నేవల్‌ స్టాఫ్‌ రోలింగ్‌ ట్రోఫీని పొందిన ఏకైక జలాంతర్గామిగా దేశ చరిత్రలో నిలిచింది.

ఐ ఎన్ ఎస్ విక్రమాదిత్యలో అగ్ని ప్రమాదం, షిప్‌లో చెలరేగిన మంటలు, ఎవరూ గాయపడలేదని, అంతా క్షేమంగా ఉన్నారని వెల్లడి

సింధు ధ్వజ్‌ తరచుగా మరమ్మతులకు గురవుతుండటంతో పదేళ్ల క్రితమే డీ కమిషన్‌ చెయ్యాలని నేవీ అత్యున్నత అధికారులు భావించారు. అయితే అదే సమయంలో 2015లో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు సంయుక్తంగా నిర్వహించే మలబార్‌ విన్యాసాలు వచ్చాయి. ఈ విన్యాసాల్లో దీని బలమేమిటో ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఈ విన్యాసాల్లోనే అమెరికా అత్యంత పవర్ పుల్ న్యూక్లియర్‌ సబ్‌మెరైన్‌ యూఎస్‌ఎస్‌ సిటీ ఆఫ్‌ కార్పస్‌ క్రిస్టీ(ఎస్‌ఎస్‌ఎన్‌–705)తో తలపడి దాన్ని ధ్వంసం చేసింది.

అందర్నీ షాక్ కు గురి చేసింది. సింధు ధ్వజ్‌ భారత నౌకాదళంలో చేరిన తర్వాత సముద్రంలో శత్రు సేనల రాకను పసిగట్టేందుకు ‘స్పెషల్‌ ఐ’గా విధులు నిర్వర్తిస్తూ వచ్చింది. మహా సముద్రాల లోతుల్లో చిక్కుకుపోయే సబ్‌ మెరైన్లలో సిబ్బందిని కాపాడే అతి క్లిష్టమైన పరీక్షని భారత్ విజయవంతంగా నిర్వహించిందంటే సింధు ధ్వజ్‌ ద్వారానే అని చెప్పవచ్చు.

2019లో బంగాళాఖాతంలో నిర్వహించిన పరీక్షల్లో ఐఎన్‌ఎస్‌ సింధు ధ్వజ్‌ను వినియోగించారు. సముద్రం అడుగున ఉన్న సింధు ధ్వజ్‌ వద్దకు డీప్‌ సబ్‌ మెరైన్‌ రెస్క్యూ వెహికల్‌ (డీఎస్‌ఆర్వీ)ను నేవీ పంపించగా.. డీఎస్‌ఆర్వీని సింధు ధ్వజ్‌ సేఫ్‌గా సముద్ర ఉపరితలానికి తీసుకొచ్చింది. ఈ విజయంతో డీఎస్‌ఆర్‌వీ వినియోగంలో అగ్ర నౌకాదళాల సరసన ఇండియన్‌ నేవీ చేరింది. అనేక విజయాల్లో కీలక భూమిక పోషించిన సింధు ధ్వజ్‌ సబ్‌మెరైన్‌ 35 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత విధుల నుంచి నిష్క్రమించింది. దేశ రక్షణకు నిర్విరామంగా అందించిన సేవలకు గాను తూర్పు నౌకాదళం సింధు ధ్వజ్‌కు ఘనంగా వీడ్కోలు పలికింది.