RIP Irrfan Khan: ఇర్ఫాన్ ఖాన్ మరణం దేశానికి తీరని లోటు, దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, తెలివైన నటుడిని కోల్పోయామన్న మహేష్ బాబు, ఇంకా ఎవరెవరు ఏమన్నారంటే..
ఆయన మృతి వార్తతో భారతీయ చిత్ర పరిశ్రమ (Indian Cinima) ఆవేదనకు గురైంది. ఇర్ఫాన్ (Irrfan Khan) మరణం పట్ల భారత ప్రధాని మోదీ (PM Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit shah), రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (Ram Nath Kovind) ఇంకా ఇతరులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
New Delhi, April 29: ప్రముఖ బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ కారణంగా మృతి (Irrfan Khan Dies at 53) చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి వార్తతో భారతీయ చిత్ర పరిశ్రమ (Indian Cinima) ఆవేదనకు గురైంది. ఇర్ఫాన్ (Irrfan Khan) మరణం పట్ల భారత ప్రధాని మోదీ (PM Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit shah), రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (Ram Nath Kovind) ఇంకా ఇతరులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత, కన్నతల్లిని కడసారి కూడా చూడలేకపోయిన బాలీవుడ్ నటుడు, పాన్ సింగ్ తోమర్ సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమనటుడి అవార్డు
ఇర్ఫాన్ మరణం ప్రపంచ సినిమాకు, నాటక రంగానికి తీరని లోటు అని అన్నారు. నటనా రంగంలో అసమాన ప్రతిభను కనపరిచిన ఇర్ఫాన్ ఎప్పటికీ గుర్తుండిపోతారని చెప్పారు. ఇర్ఫాన్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని ట్వీట్ చేశారు.
మరోవైపు ఇర్ఫాన్ మృతిపై అమిత్ షా స్పందిస్తూ... మరణవార్త తనను ఎంతో ఆవేదనకు గురి చేసిందని చెప్పారు. అసమాన నటనతో ప్రపంచ స్థాయిలో ఇర్ఫాన్ పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకున్నారని కొనియాడారు. ఆయన మరణంతో దేశం ఒక గొప్ప నటుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇర్ఫాన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
PM Narendra Modi's Tweet on Irrfan Khan's Death
Home minister Amit Shah's Tweet on Irrfan Khan's Death
ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అకాల మరణం నన్ను కలిచివేసింది. అరుదైన ప్రతిభ మరియు అద్భుతమైన నటుడు, అతని వైవిధ్యమైన పాత్రలు మరియు అద్భుతమైన ప్రదర్శనలు మన జ్ఞాపకాలలో ఉంటాయి. సినిమా ప్రపంచానికి, లక్షలాది మంది సినీ ప్రేమికులకు అతను లేకపోవడం పెద్ద నష్టమే. అతని కుటుంబానికి & అబిమానులకు ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నానని రామ్ నాథ్ కోవింద్ ప్రకటించారు.
Here's the tweet by the President of India:
53 ఏళ్ల ఇర్ఫాన్ ఖాన్ ఈరోజు ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. లండన్ లో చికిత్స చేయించుకున్న ఇర్ఫాన్ ఇటీవలే ఇండియాకు వచ్చారు. 'ఆంగ్రేజీ మీడియం' అనే సినిమాలో చివరిసారిగా నటించారు. ఇర్ఫాన్ మరణంతో బాలీవుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
Here's Rahul Gandhi Tweet
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక తెలివైన నటుడిని కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు. ఇర్ఫాన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నానని మహేశ్ ట్వీట్ చేశారు. కాగా,ఇర్ఫాన్, మహేష్ కలిసి సైనికుడు చిత్రంలో కలిసి నటించిన విషయం తెలిసిందే.
Here's the tweet by the Mahesh Babu
Amitabh Bachchan Tweet
Shah Rukh Khan Tweet
Salman Khan Tweet
ఇర్ఫాన్ ఖాన్ మృతి నన్ను షాక్‌కి గురి చేసింది. మా కాలంలోని అసాధారణమైన నటులలో ఆయన ఒకరు. ఆయన సినిమాలు, నటన ఎల్లకాలం గుర్తుండిపోతాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) వ్యాఖ్యానించారు.
Here's Tweet by The Delhi CM Arvind Kejriwal
నేటి తరంలో చెప్పుకోతగ్గ నటుడైన ఇర్ఫాన్ మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇది నన్ను షాక్ నకు గురి చేసింది. ఆయన కుటుంబానికి ఈ సమయంలో తట్టుకుని నిలిచే బలాన్ని ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలి" రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించారు.
Here's the tweet by the Rajasthan CM Ashok Gehlot :
ఇర్ఫాన్ ఖాన్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన మరణవార్త విని చలించిపోయాను. ఆయన కుటుంబీకులకు, స్నేహితులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను... ఓమ్ శాంతి’ అని సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్ ట్వీట్ చేశారు.
నా ప్రియమైన స్నేహితుడు ఇర్ఫాన్. మీరు పోరాడారు, పోరాడారు, పోరాడారు. నేను మీ గురించి ఎప్పుడూ గర్వపడతాను .. మళ్ళీ మనం కలుద్దాం .. సుతాపా మరియు బాబిల్ కు సంతాపం .. మీరు కూడా పోరాడారు, సుతాపా మీరు ఈ పోరాటంలో సాధ్యమైనవన్నీ ఇచ్చారు. శాంతి మరియు ఓం శాంతి. ఇర్ఫాన్ ఖాన్‌కి వందనం’అని ప్రముఖ డైరెక్టర్, నిర్మాత సూజిత్ సర్కార్ ట్వీట్ చేశారు.
Irrfan Khan's Childhood Frined Jayadev
Prakash Javadekar Tweet
ఇర్ఫాన్ ఖాన్ మరణంపై ఆయన చిన్ననాటి స్నేహితుడు భరత్ పూర్ (రాజస్థాన్) ఎస్పీ హైదర్ అలీ జైదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. తన స్నేహితుడు ఇర్ఫాన్ ఖాన్ ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన చెందారు. ఇర్ఫాన్ గొప్ప మనిషి అని వ్యాఖ్యానించిన ఆయన ఏ క్షణమైనా అతడినుంచి ఫోన్ వస్తుందని ఇప్పటికీ ఎదురు చూస్తున్నానంటూ కంటతడి పెట్టారు.