ITR Filing 2024: ఐటీ రిట‌ర్న్స్ ఫైల్ చేసేట‌ప్పుడు స‌రైన ఫామ్ ఎన్నుకోవ‌డం చాలా సులువు, ఎంత ఆదాయం ఉన్న‌వాళ్లు ఏ ఫామ్ సెల‌క్ట్ చేసుకోవాలంటే?

అయితే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నోటిఫై చేస్తూ జారీచేసిన ఐటీఆర్ ఫామ్స్‌లో (Income Tax Return Form) సరైన ఫామ్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

It Returns Filing (PIC@ Pixabay)

Mumbai, June 20: గత ఆర్థిక సంవత్సరం 2023-24 (2024-25 అంచనా సంవత్సర) ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే టైం వచ్చేసింది. వచ్చేనెల 31 లోగా పన్ను చెల్లింపుదారులు, వేతన జీవులు ఐటీ రిటర్న్స్ తప్పనిసరిగా ఫైల్ చేయాల్సి (ITR) ఉంటుంది. అయితే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నోటిఫై చేస్తూ జారీచేసిన ఐటీఆర్ ఫామ్స్‌లో (Income Tax Return Form) సరైన ఫామ్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుదారులైనా, వ్యాపారులైనా, వేతన జీవులైనా, ఆస్తిపై వచ్చే ఆదాయంతో జీవిస్తున్న వారైనా.. ఎవరైనా తమ ఆదాయం, నివాసం తదితర వివరాల ఆధారంగా ఐటీఆర్ ఫామ్స్ ఎంచుకోవాలి. సీబీడీటీ జారీ చేసిన ఏడు రకాల ఫామ్స్‌లో మూడు మాత్రమే వేతన జీవులకు.. పరిమితి లోపు ఐటీఆర్ దాఖలు చేసే వారికి ఉపకరిస్తాయి.

రూ.50 లక్షల్లోపు ఆదాయం, ఒకే ఇంటిపై ఆదాయం, వడ్డీ, ఇతర మార్గాల్లో ఆదాయం కల వారికి ‘ఐటీఆర్-1’ (ITR -1) ఫామ్ వర్తిస్తుంది.

రూ.50 లక్షలకు పైగా ఆదాయం పెట్టుబడి లాభాలు, బిజినెస్ ద్వారా వచ్చే ఆదాయం, విదేశాల నుంచి వచ్చే ఆదాయం, ఒకటి కంటే ఎక్కువ ఇండ్లపై వచ్చే ఆదాయం కల వారు ‘ఐటీఆర్-2’ (ITR -2) ఫామ్ ఎంచుకోవాలి.

ITR Filing: ఇన్ కమ్ ట్యాక్స్ రిట‌ర్న్స్ ఫైల్ చేస్తున్నారా? ఈ స్టెప్స్ ఫాలో అయితే నిమిషాల్లోనే ఫైలింగ్ పూర్త‌వుతుంది 

హిందూ అవిభాజ్య కుటుంబం (HUF), వ్యాపారం, వృత్తి ద్వారా ఆదాయం సంపాదించే వారు ‘ఐటీఆర్-3’ ఫామ్ వాడాల్సి ఉంటుంది.

వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (HUF), భాగస్వామ్య సంస్థలు, సెక్షన్ 44ఏడీ, 44ఏఈ సెక్షన్ల ప్రకారం ఆదాయం అంచనా వేసే వారు, వేతనం / పెన్షన్ ద్వారా రూ.50 లక్షల వరకూ ఆదాయం సంపాదిస్తున్న వారు, ఒక ఇంటిపై రూ.50 లక్షల్లోపు, ఇతర మార్గాల్లో రూ.50 లక్షల్లోపు ఆదాయం సంపాదిస్తున్న వారు ‘ఐటీఆర్-4’ ఫామ్ వినియోగించుకోవాలి.

కంపెనీలు, ఎల్ఎల్‌పీ (Limited Liability Partnership), ఐఓపీలు (Association of Persons), బీవోఐలు (Body of Individuals), ఆర్టిఫిషియల్ జ్యురిడికల్ పర్సన్ (AJP), ఎస్టేట్ ఆఫ్ డిసీజ్డ్, ఎస్టేట్ ఆఫ్ ఇన్ సాల్వెంట్, బిజినెస్ ట్రస్ట్, ఇన్వెస్ట్ మెంట్ విభాగాల పరిధిలోకి వచ్చే వారు ‘ఐటీఆర్-5’ ఫామ్ వాడాలి.

చారిటీ, మత పరమైన అవసరాల కోసం ఉన్న ఆస్తి ద్వారా లభించే ఆదాయంతో జీవిస్తూ సెక్షన్ 11 కింద మినహాయింపు కోరని కంపెనీలు ‘ఐటీఆర్-6’ ఫామ్ వినియోగించుకోవాలి. దీన్ని తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ రూపంలోనే ఫైల్ చేయాలి.

సెక్షన్ 139 (4ఏ), 139 (4బీ), 139 (4సీ), 139 (4డీ), 139 (4ఈ), 139 (4ఎఫ్) ప్రకారం ఐటీఆర్ ఫైల్ చేసే వ్యక్తులు, సంస్థలకు ‘ఐటీఆర్-7’ ఫామ్ వర్తిస్తుంది. ఈ ఫామ్ పరిధిలోకి ట్రస్టులు, రాజకీయ పార్టీలు, సంస్థలు, కళాశాలలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు వస్తాయి.