Mumbai, June 15: 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ (IT returns) దాఖలుకు గడువు దగ్గరపడుతోంది. చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ఉండాలంటే పన్ను చెల్లింపుదారులు ఈ ప్రక్రియను ముందుగానే ప్రారంభించాలి. ఆదాయపు పన్ను పోర్టల్‌ను (Income Tax portal) ఆన్‌లైన్‌లో ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. మీ ఐటీఆర్ (ITR Filing) ఆన్‌లైన్‌లో ఫైల్ చేసే ముందు కొన్ని డాక్యుమెంట్‌లను తప్పనిసరిగా ఉంచుకోవాలి. అవసరమైన డాక్యుమెంట్‌లలో పాన్, ఆధార్ కార్డ్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, ఫారం16, డొనేషన్ రిసిప్ట్స్, బ్రోకర్ ప్లాట్‌ఫారమ్ నుంచి స్టాక్ ట్రేడింగ్ స్టేట్‌మెంట్‌లు, లైఫ్ అండ్ హెల్త్ కోసం ఇన్సూరెన్స్ పాలసీ చెల్లించిన రసీదులు, పాన్‌తో లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ డేటా, ఇ-ధృవీకరణకు ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ బ్యాంకుల నుంచి రిటర్న్ వడ్డీ సర్టిఫికెట్లను వినియోగించవచ్చు.
ఆదాయపు పన్ను పోర్టల్‌కి లాగిన్ చేయండి :
అధికారిక ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌కి లాగిన్ చేయడానికి సైట్‌ను సందర్శించి ‘లాగిన్’పై క్లిక్ చేయండి. మీ పాన్ కార్డును యూజర్ ఐడీగా రిజిస్టర్ చేయండి. ఆపై ‘Continue’ క్లిక్ చేయండి. టిక్‌బాక్స్‌లోని సెక్యూరిటీ మెసేజ్ చెక్ చేసి.. మీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి ఆపై ‘Continue’ క్లిక్ చేయండి.
‘ఫైల్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్’పై క్లిక్ చేయండి :
‘ఇ-ఫైల్’ ట్యాబ్‌పై క్లిక్ చేసి ‘ఆదాయ పన్ను రిటర్న్స్’ ఎంచుకుని ఆపై ‘ఫైల్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్’ ఎంచుకోండి.
సరైన అసెస్‌మెంట్ సంవత్సరాన్ని ఎంచుకోండి :
ఆర్థిక సంవత్సరం 2023–24 ఫైలింగ్‌ల కోసం ‘అసెస్‌మెంట్ ఇయర్’ని ‘AY 2024-25’గా లేదా FY 2022-23 ఫైలింగ్‌ల కోసం ‘AY 2023-24’ని ఎంచుకుని, ‘ఆన్‌లైన్’ ఫైల్ మోడ్‌ని ఎంచుకోండి. ఒరిజినల్ రిటర్న్ లేదా రివైజ్డ్ రిటర్న్ అని సరిగ్గా ఎంచుకోండి.
సరైన స్టేటస్ ఎంచుకోండి :
అందించిన ఆప్షన్ల నుంచి మీ ఫైలింగ్ స్టేటస్ ఎంచుకోండి. యూజర్ హెచ్‌యూఎఫ్ లేదా ఇతరులలో వ్యక్తుల కోసం ‘Individual’ ఎంచుకుని, ‘Continue’ ఆప్షన్ క్లిక్ చేయండి.
ఐటీఆర్ టైప్ ఎంచుకోండి :
మీ వివరాల ఆధారంగా తగిన ఐటీఆర్ ఫారమ్‌ను ఎంచుకోండి. అందుబాటులో ఉన్న 7 ఫారమ్‌లలో ఐటీఆర్ 1 నుంచి 4 హెచ్‌యుఎఫ్‌లకు వర్తిస్తాయి. హెచ్‌యుఎఫ్‌ల కోసం ఐటీఆర్ 2 వంటి మీ పన్ను సరిపోతాయో లేదో నిర్ణయించండి. అందులో వ్యాపారం లేదా వృత్తి నుంచి ఆదాయం అనే విషయాన్ని ఎంచుకోవాలి.
ఐటీఆర్ ఫైలింగ్ రీజన్ :
మీరు ఐటీఆర్ ఫైల్ చేయడానికి సరైన కారణాన్ని ఎంచుకోవాలి. మీ రిటర్న్‌లను ఫైలింగ్ రీజన్ తెలిపాలి. ప్రాథమిక మినహాయింపు పరిమితిని మించి పన్ను విధించదగిన ఆదాయాన్ని కలిగి ఉండటం, ఐటీఆర్ ఫైలింగ్‌ను తప్పనిసరి చేసే నిర్దిష్ట ప్రమాణాలను పాటించడం లేదా ‘ఇతరులు’ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
వ్యాలిడేషన్ :
మీ పాన్, ఆధార్, పేరు, పుట్టిన తేదీ, కాంటాక్టు ఇన్ఫర్మేషన్, బ్యాంక్ వివరాలను ధృవీకరించండి. అలాగే, మీ బ్యాంక్ అకౌంట్ డేటా వివరాలను కూడా ఇవ్వండి. ఇప్పటికే అందించి ఉంటే.. ముందే వెరిఫై అయిందని నిర్ధారించుకోండి. మీ సంబంధిత ఆదాయం, మినహాయింపులు, తగ్గింపులను దశలవారీగా వెల్లడించండి. కచ్చితత్వాన్ని నిర్ధారించడానికి మీ యజమాని, బ్యాంక్ వంటి సమాచారాన్ని సమీక్షించండి. మీ రిటర్న్‌ల డేటాను నిర్ధారించండి. ఆయా వివరాలను ధృవీకరించండి. అవసరమైన బ్యాలెన్స్ పన్ను చెల్లింపులు చేయండి.
ఇ-వెరిఫికేషన్ :
చివరి దశలో ఆధార్ ఓటీపీ, ఈవీసీ, నెట్ బ్యాంకింగ్ వంటి మెథడ్స్ ఉపయోగించి 30 రోజులలోపు మీ ఐటీఆర్ ధృవీకరించడం లేదా ఐటీఆర్-వి ఫిజికల్ కాపీని సీపీసీ బెంగళూరుకు పంపడం ద్వారా ఫైల్ ప్రక్రియను పూర్తి చేయొచ్చు