Jammu and Kashmir: సెక్యూరిటీ దళాలపై ఉగ్ర‌వాదుల గ్రేనేడ్ దాడి, ఏడుగురు పౌరులకు గాయాలు, భారీ స్థాయిలో సెర్చ్ ఆప‌రేష‌న్ చేపట్టిన జమ్మూకాశ్మీర్ పోలీసులు

సెక్యూరిటీ దళాలే లక్ష్యంగా గ్రేనేడ్ దాడికి పాల్ప‌డ్డారు. పుల్వామా జిల్లాలోని (Pulwama) త్రాల్ బ‌స్సు స్టాండ్ వ‌ద్ద సెక్యూర్టీ ద‌ళాల‌పై ఉగ్ర‌వాదులు గ్రేనేడ్ల‌తో దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో ఏడుగురు పౌరులు (8 civilians injured) గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డ్డ వారి ఆరోగ్య ప‌రిస్థితి బాగానే ఉంద‌ని జేకే పోలీసులు తెలిపారు.

Indian security forces near Line of Control in Jammu and Kashmir (Photo Credits: IANS)

Srinagar, Jan 2: జ‌మ్మూక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదులు మరోసారి రెచ్చిపోయారు. సెక్యూరిటీ దళాలే లక్ష్యంగా గ్రేనేడ్ దాడికి పాల్ప‌డ్డారు. పుల్వామా జిల్లాలోని (Pulwama) త్రాల్ బ‌స్సు స్టాండ్ వ‌ద్ద సెక్యూర్టీ ద‌ళాల‌పై ఉగ్ర‌వాదులు గ్రేనేడ్ల‌తో దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో ఏడుగురు పౌరులు (8 civilians injured) గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డ్డ వారి ఆరోగ్య ప‌రిస్థితి బాగానే ఉంద‌ని జేకే పోలీసులు తెలిపారు.

సహ‌‌స్త్ర సీమా బ‌ల్‌(ఎస్ఎస్‌బీ)ను టార్గెట్ చేస్తూ ఉగ్ర‌వాదులు గ్రేనేడ్ల‌ను విసిరారు. కానీ టార్గెట్ త‌ప్ప‌డంతో ఆ గ్రేనేడ్లు రోడ్డుపై పేలాయి. ఆ ప్రాంతాన్ని జమ్మూకాశ్మీర్ పోలీసులు (Jammu and Kashmir Police) దిగ్భందం చేశారు. భారీ స్థాయిలో సెర్చ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే జమ్మూకశ్మీరులోని శ్రీనగర్ హరిసింగ్ హై స్ట్రీటులో ఉగ్రవాదులు ఓ దుకాణదారుడిని కాల్చి చంపారు.శ్రీనగర్ లోని సారైబాలా ప్రాంతానికి చెందిన స్వర్ణకారురు సత్పాల్ నికల్ పై గుర్తుతెలియని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో సత్పాల్ నికల్ తీవ్రంగా గాయపడ్డారు. తూటా గాయాలతో ఉన్న సత్పాల్ నికల్ ను ఆసుపత్రికి తీసుకువెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించాడని ప్రకటించారు.

దారుణం..పాకిస్థాన్‌లో హిందూ దేవాలయాలు ధ్వంసం, తీవ్రంగా ఖండించిన భారత్, పాకిస్థాన్ ప్రభుత్వానికి దౌత్య మార్గాల్లో తీవ్ర నిరసన, జనవరి 5న పాక్ సుప్రీంకోర్టులో విచారణ

ఉగ్రవాదుల కాల్పుల ఘటన అనంతరం అప్రమత్తమైన జమ్మూకశ్మీర్ పోలీసులు ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు. ఉగ్రవాదులు స్వర్ణకారుడిని ఎందుకు కాల్చిచంపారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గత రెండు సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది ఉగ్రవాద కార్యకలాపాలు చాలా తక్కువ అని ఆ రాష్ట్ర డీజీపీ దిల్‌బాగ్‌ సింగ్‌ తెలిపారు. గురువారం డీపీజీ మీడియాతో మాట్లాడుతూ.. 2018, 2019 సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది ఉగ్రవాద సంబంధిత ఘటనలు కశ్మీర్‌లో తగ్గినట్లు వివరించారు.

ఉగ్రవాద సంస్థల్లో చేరుతున్నవారి సంఖ్య మాత్రం పెరిగినట్లు ఆయన వెల్లడించారు. అయితే 2019 సంవత్సరంతో పోలిస్తే ఇది ఎక్కువగా ఉందన్నారు. ఇందులో 70 శాతం మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలిపారు. ఉగ్రవాదుల జీవిత కాలం తగ్గిపోతున్నట్లు చెప్పారు. కోవిడ్‌ 19 వల్ల ఇప్పటి వరకు రాష్ట్రంలో 15 మంది పోలీసులు మరణించారని, రాష్ట్రంలో సుమారు 3,500 మంది పోలీసులకు కరోనా సోకినట్లు పేర్కొన్నారు.

పాకిస్తాన్‌తో యుద్ధం వస్తే 10 కోట్ల మంది మాడి మసైపోతారు, ప్రపంచమంతా ఆకలి కేకలు వినిపిస్తాయి. గడ్డి కూడా మొలవదు, అధ్యయనంలో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు

శతృదేశమైన పాక్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. గత నాలుగేళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది చొరబాట్లు చాలా తగ్గాయన్నారు. అందుకే ఆయుధాలు, పేలుడు పదార్థాలను సరఫరా చేసే ప్రయత్నం చేశారని డీజీపీ తెలిపారు. జమ్మూ ప్రాంతంలో డజన్ల కొద్ది ఉగ్రవాదులు ఉండేవారని, ఇప్పుడా సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని వివరించారు. ఈ ఏడాది జమ్మూకశ్మీర్‌లో 100కుపైగా ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు నమోదు కాగా, వాటిల్లో 225 మంది ఉగ్రవాదులు హతమైనట్లు డీజీపీ దిల్‌బాగ్‌ సింగ్ తెలిపారు.