Jammu And Kashmir Terror Attack: జమ్మూలో విరుచుకుపడిన ఉగ్రవాదులు, అమరులైన ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు, మరో ముగ్గురికి గాయాలు, చైనా, పాకిస్తాన్‌తో యుద్ధానికి రెడీగా ఉన్నామని తెలిపిన చీఫ్ ఆర్.కే. బధూరియా

పాంపర్ జిల్లాలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు (Terror Attack in Jammu and Kashmir) తెగబడ్డారు. భద్రతా బలగాల పెట్రోలింగ్ వాహనాలపై కాల్పులకు దిగారు.పుల్వామా జిల్లా పాంపోర్‌లోని కందిజల్‌ బ్రిడ్జిపై (Pampore Bypass of Pulwama) జమ్ము కశ్మీర్‌ పోలీసులతో కలిసి విధులు నిర్వహిస్తున్న 110 బెటాలియన్‌ సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిపై ఉగ్రవాదులు సోమవారం కాల్పులతో విరుచుకుపడ్డారు.

terrorists attack CRPF road opening party in Pulwama (Photo Credits: ANI/Deferred Visuals)

Pulwama, October 5: జమ్ము కశ్మీర్‌లో​ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పాంపర్ జిల్లాలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు (Terror Attack in Jammu and Kashmir) తెగబడ్డారు. భద్రతా బలగాల పెట్రోలింగ్ వాహనాలపై కాల్పులకు దిగారు.పుల్వామా జిల్లా పాంపోర్‌లోని కందిజల్‌ బ్రిడ్జిపై (Pampore Bypass of Pulwama) జమ్ము కశ్మీర్‌ పోలీసులతో కలిసి విధులు నిర్వహిస్తున్న 110 బెటాలియన్‌ సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిపై ఉగ్రవాదులు సోమవారం కాల్పులతో విరుచుకుపడ్డారు.

ఓ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా విధినిర్వహణలో ఉన్న సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రవాదులు ఈ దాడికి తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. మరో ముగ్గురు జవాన్లని దగ్గర్లోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తమై తరలించినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఉగ్రదాడిపై పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉంటే చైనా, పాకిస్తాన్ తో ఏకకాలంలో యుద్ధం చేయడానికి భారత వైమానిక దళం రెడీగా ఉందని చీఫ్ ఆర్.కే. బధూరియా (Air Chief Marshal RKS Bhadauria) సోమవారం ప్రకటించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా తాము గట్టి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నామని, అన్ని ప్రాంతాల్లోనూ బలగాలు మోహరించే ఉన్నాయని తెలిపారు.

మీ చట్టాలతో రైతులకు అన్యాయం చేస్తారా? ప్రధాని మోదీపై విరుచుకుపడిన రాహుల్ గాంధీ, ఖేతీ బచావో యాత్ర పేరుతో 3 రోజుల పాటు పంజాబ్‌లో ర్యాలీలు నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ

భారత్, చైనా మధ్య సరిహద్దు గొడవలున్న నేపథ్యంలో బధూరియా పై విధంగా స్పందించారు. చైనా చేస్తున్న దుశ్చర్యలు మే నెలలోనే తెలిశాయని, అప్పటి నుంచి తాము అప్రమత్తంగానే ఉన్నామని అన్నారు.చైనా కంటే భారత్ ఎందులోనూ తక్కువగా లేదని, భారత బలగాలు అన్ని రంగాల్లోనూ సర్వ సన్నద్ధంగానే ఉన్నాయని వెల్లడించారు.

Tweet by ANI: 

కాలంతో పాటే వైమానిక దళం కూడా మారిందని, అనేక మార్పులు కూడా జరిగాయని, చాలా లోపాలను సవరించామని ఆయన పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ముఖ్యమైన ప్రదేశాల్లో బలగాలు అలర్ట్ గానే ఉన్నాయని, లద్దాఖ్‌లో మోహరింపు అందులో భాగమేనన్నారు. ఈశాన్యంలో సర్వ సన్నద్ధంగానే ఉన్నామని, ఏ సమయంలో ఏ సంక్లిష్ట పరిస్థితులు తలెత్తినా మాత్రం ఎదుర్కొనేందుకు సిద్ధపడిపోయామని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య చర్చలు నెమ్మదించాయన్నది ఎంత మాత్రమూ వాస్తవం కాదని, అనుకున్న ప్రకారమే నడుస్తాయని బధూరియా తెలిపారు.