Jharkhand Election 2019: జార్ఖండ్ ఎన్నికలకు సర్వం సిద్ధం, తొలి విడతలో 13 అసెంబ్లీ నియోజక వర్గాలకు పోలింగ్, మొత్తం అయిదు దశల్లో ఎన్నికలు, ఉదయం 7 నుంచి సాయంత్రం 3 వరకు పోలింగ్, డిసెంబర్ 23న ఫలితాలు

ఇక్కడ మొత్తం 37 కోట్ల 83 లక్షల 055 మంది ఓటర్లున్నారు. ఇక్కడ ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలన్నాయి. మొదటి దశలో (first phase of vote in the Jharkhand Assembly polls) బీజేపీ 12 చోట్ల పోటీ చేస్తోంది. ఒక చోట స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు కలిసి మహాకూటమిగా పోటీ చేస్తున్నాయి.

Jharkhand assembly election 2019: Polling in 13 constituencies in six districts (Photo-PTI)

Ranchi, November 30: జార్ఖండ్‌లో ఎన్నికల నగారా (Jharkhand Election 2019) నేడు పోలింగ్ జరుగనుంది. ఇక్కడ మొత్తం 37 కోట్ల 83 లక్షల 055 మంది ఓటర్లున్నారు. ఇక్కడ ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలన్నాయి. మొదటి దశలో (first phase of vote in the Jharkhand Assembly polls) బీజేపీ 12 చోట్ల పోటీ చేస్తోంది. ఒక చోట స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు కలిసి మహాకూటమిగా పోటీ చేస్తున్నాయి.

మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు(five-phased Assembly elections) నిర్వహించనున్నారు. డిసెంబర్ 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి. కాగా జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)(Jharkhand Mukti Morcha (JMM)), కాంగ్రెస్ ఆర్జేడీ (Congress and Rashtriya Janata Dal (RJD) )కూటమిల మధ్య పోటీ చాలా గట్టిగా ఉండనున్నట్లు ఐయాన్స్ - సీఓటర్ సంస్థలు చేసిన సర్వేలో వెల్లడైంది.

కాగా జార్ఖండ్ రాష్ట్రంలో మరోసారి పాగా వేయాలని బీజేపీ(BJP) ప్రయత్నిస్తోంది. అక్కడ మహారాష్ట్ర ఫలితాలు వెల్లడి అవుతాయని పలువురు భావిస్తున్నారు. 2000లో ప్రత్యేక రాష్ట్రంగా జార్ఖండ్ ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవి నాలుగో అసెంబ్లీ ఎన్నికలు. నక్సల్స్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌(All Jharkhand Students' Union)తో కలిసి పోటీ చేసిన బీజేపీ 43 స్థానాల్లో గెలిచి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడు బీజేపీ 37 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు జరుగుతున్న తొలి దశ ఎన్నికల్లో 189 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ముఖ్యమైన తేదీలు, సమాచారం

మొత్తం 3 వేల 906 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.

2020 జనవరి 05తో రాష్ట్రంలో ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది.

నవంబర్ 30న తొలి దశ పోలింగ్. డిసెంబర్ 07న రెండో దశ. డిసెంబర్ 12న మూడో దశ. డిసెంబర్ 16న నాలుగో దశ.డిసెంబర్ 20న ఐదో దశ.

డిసెంబర్ 23న ఎన్నికల ఫలితాలు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif