Emergency Movie Postponed: ఎమర్జెన్సీ సినిమా మరోసారి వాయిదా, ఓ వర్గం మతస్థుల మనోభావాలు దెబ్బతీసేలా సినిమా ఉందని ఆరోపణ, కంగనా రనౌత్‌కు మధ్యప్రదేశ్‌ హైకోర్టు నోటీసులు

వాయిదాకు కారణం ఏంటంటే.. సినిమాలో సెన్సిటివ్ కంటెంట్ ఉందని CBFC తెలిపింది. ఎమర్జెన్సీ సినిమా రిలీజ్‌ నిలిపివేయడానికి కారణాలు తెలియజేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) వివరించింది. సినిమాలు మతపరమైన మనోభావాలను దెబ్బతీయకూడదని బోర్డు సూచించింది.

Kangana Ranaut (Photo Credits: Instagram)

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎమర్జెన్సీ సినిమా మరోసారి వాయిదా పడింది. వాయిదాకు కారణం ఏంటంటే.. సినిమాలో సెన్సిటివ్ కంటెంట్ ఉందని CBFC తెలిపింది. ఎమర్జెన్సీ సినిమా రిలీజ్‌ నిలిపివేయడానికి కారణాలు తెలియజేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) వివరించింది. సినిమాలు మతపరమైన మనోభావాలను దెబ్బతీయకూడదని బోర్డు సూచించింది.

ప్రస్తుతం కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్ లోని మండి పార్లమెంట్ ఎంపీగా కూడా ఉన్నారు. ఈ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రలో ఆమెనే నటించారు.మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1972లో విధించిన ఎమర్జెన్సీ కాలంనాటి రాజకీయ పరిణామాల గురించి ఈ సినిమాలో వివరించారు. సెప్టెంబర్ 6న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే సిక్కుల మతస్థుల మనోభావాలు దెబ్బతీలా ఈ సినిమా తీశారని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ ఆరోపిస్తోంది. నేను ఇంతవరకు మొబైల్‌ ఫోన్‌లో సినిమాలు చూడలేదు, షోలే రీ రిలీజ్‌ సినిమా చూసిన తర్వాత అమితాబ్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆగస్టు 14న ఎమర్జెన్సీ మూవీ ట్రైలర్‌ రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఈ సినిమాపై విమర్శలు, వివాదాలు వస్తున్నాయి. ట్రైలర్‌లో పంజాబ్ వేర్పాటువాద ఖలిస్తాన్ ఉద్యమ నాయకుడు జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే పాత్రను తప్పుగా చిత్రీకరించారని ఆరోపణలు ఉన్నాయి. అకాల్ తఖ్త్ సాహిబ్‌పై బాంబు దాడి, ఆపరేషన్ బ్లూ స్టార్, ఎమర్జెన్సీ టైంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలను విస్మరిస్తూ.. కథను పూర్తిగా ఒకవైపు మాత్రమే చూపించారని కొన్ని వర్గాలు ఎమర్జెన్సీ సినిమాని వ్యతిరేకిస్తున్నాయి.ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ (DSGMC) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) మరియు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు సినిమా విడుదలను ఆపాలని లేఖలు పంపింది. సినిమా ప్రదర్శనపై నిషేధం విధించాలని కోరింది.

ఇక  బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut)కు మధ్యప్రదేశ్‌ హైకోర్టు (Madhya Pradesh High Court) నోటీసులు జారీ చేసింది. ‘ఎమర్జెన్సీ’ (Emergency) సినిమా విషయంలో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై న్యాయస్థానం నోటీసులు పంపించింది. ఈ నటితోపాటు కేంద్ర ప్రభుత్వం, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం, సెన్సార్‌ బోర్డు, మణికర్ణిక ఫిల్మ్స్‌, జీ స్టూడియోస్ సంస్థలు, జీ స్టూడియోస్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ ఉమేశ్‌ కె బన్సాల్‌, యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ (ఇండియా)లకు నోటీసులు జారీ చేసింది.

ఎమర్జెన్సీ’ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఒక వర్గం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయని, అందులో ప్రధాన పాత్ర పోషించిన కంగన క్షమాపణ చెప్పాలంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీన్ని విచారించిన చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌దేవ, జస్టిస్‌ వినయ్‌ సరఫ్‌లతో కూడిన ధర్మాసనం.. 24 గంటల్లోపు స్పందించాలని వారికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.