Karnataka Bans Hookah: పొగాకు ఉత్పత్తులపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం, హుక్కా తాగడంపై నిషేదం విధిస్తూ ఉత్తర్వులు

రాష్ట్ర వ్యాప్తంగా హుక్కా (Hookah) తాగడంపై నిషేధం విధించింది. ప్రజలు, యువత ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్‌ గుండూరావు ప్రకటించారు. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. .

Karnataka Bans Hookah (PIC@ FB)

Bangalore, FEB 08: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా హుక్కా (Hookah) తాగడంపై నిషేధం విధించింది. ప్రజలు, యువత ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్‌ గుండూరావు ప్రకటించారు. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. హుక్కా తాగడం (Hookah smoking) వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నదని పేర్కొన్నారు. అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా హుక్కాను నిషేధిస్తున్నామని చెప్పారు. భవిష్యత్‌ తరాలకు మెరుగైన, సురక్షితమైన ఆరోగ్యకర వాతావరణాన్ని సృష్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని వెల్లడించారు.

Niloufer Hospital Fire: నిలోఫర్‌ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం, మొదటి అంతస్తులోని ల్యాబ్‌లో భారీగా ఎగసిన మంటలు, వీడియో ఇదిగో.. 

యువత హుక్కాబార్లకు ఆకర్షితులవుతున్నారని, ఇది వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుందని తెలిపారు. పొగాకు ఉత్పత్తులకు యువత బానిసలుగా మారుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతుండడంతో గతేడాది సెప్టెంబర్‌ నెలలో హుక్కా బార్లను నిషేధించిన ప్రభుత్వం, పొగాకు ఉత్పత్తుల కొనుగోలు వయసును 18 నుంచి 21 ఏండ్లకు పెంచింది. పాఠశాలలు, ఆలయాలు, మసీదులు, శిశు సంరక్షణ కేంద్రాలు, దవాఖానల చుట్టుపక్కల పొగాకు వాడకం, విక్రయాన్ని ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది.