Karnataka: కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే కూతురు వీరంగం, సిగ్నల్ జంప్ చేసి నేనే ఎవరో తెలుసా అంటూ పోలీసులతో వాగ్వాదం, క్షమాపణ కోరిన ఆమె తండ్రి బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలీ
నా కారునే ఆపుతావా, నేనెవరో తెలుసా అంటూ పోలీసుపై మండిపడింది.
Bengaluru, June 10: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలీ కూతురు ట్రాఫిక్‌లో సిగ్నల్ జంప్ చేయడమే కాకుండా పోలీసులతో అసభ్యంగా (Misbehaves' With Police) ప్రవర్తించింది. నా కారునే ఆపుతావా, నేనెవరో తెలుసా అంటూ పోలీసుపై మండిపడింది. ఈమె తన బీఎండబ్ల్యూ కారు డ్రైవ్ చేస్తూ రోడ్డుపైకి వచ్చింది. ఓచోట రెడ్ సిగ్నల్ పడినా ఆగకుండా రయ్‌మంటూ దూసుకెళ్లింది. ఇది తెలిసిన ట్రాఫిక్ పోలీస్ ఆమె కారును ట్రేస్ చేసి రాజ్‌భవన్ రోడ్డు వద్ద ఆపారు.
కారును పోలీసులు అడ్డుకోవడంతో చిర్రెత్తిన ఎమ్మెల్యే (BJP MLA Arvind Limbavali Daughter) కుమార్తె నా కారే ఆపుతావా అంటూ పోలీసులతో అనుచితంగా ప్రవర్తించింది. ‘నేనే ఎవరో తెలుసా. నేను ఇప్పుడు వెళ్లాలి. నా కారును ఆపోద్దు. ఓవర్‌టేక్ చేసినందుకు నాపై కేసు పెట్టలేవు. ఇది ఎమ్మెల్యే వాహనం. మా నాన్న అరవింద్ లింబావలీ’ (MLA Aravind Limbavali) అంటూ పోలీసులపై రెచ్చిపోయింది. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులతోనూ గొడవ పడింది. దీంతో రాజ్‌భవన్ వద్ద జనాలు గుమిగూడటంతో కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.
యువతి సీట్ బెల్టుకూడా పెట్టుకోలేదని తెలిసింది. అయితే ఆమె మాటలు పట్టించుకొని పోలీసులు యువతికి జరిమానా విధించారు అలాగే బీఎండబ్ల్యూ కారు నెంబర్‌పై చలాన్లు పరిశీలించగా పోలీసులు ఖంగుతున్నారు. ఆమె వాహనంపై 9 వేల రూపాయల చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అంతేగాక ప్రస్తుతం ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకు, నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేసినందుకు రూ. 1000 జరిమానా విధించారు. దీంతో మొత్తం 10 వేలను ఆమె ఉంచి పోలీసులు రాబట్టారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అరవింద్ తన కూతురు ప్రవర్తనపట్ల పోలీసులు, జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పారు.