Karnataka Crime: పోలీసులకు డాగ్ స్వాడ్‌లా మారిన బీర్ బాటిల్ మూత, యువకుల తలలపై బాటిళ్లతో దాడి చేసిన నిందితులను పట్టించిన క్యాప్

బీరు సీసా మూత నిందితులను పట్టించింది. దీని సాయంతో బెంగళూరులోని మిలీనియం బార్‌ వద్ద ఈనెల 16న అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులపై జరిగిన దాడి ఘటనను చంద్రాలేఔట్‌ పోలీసులు ఛేదించారు.

Cap of beer bottle (photo-Pixabay)

Bengaluru, July 27: కర్ణాటకలో ఓ హత్య కేసుకు తాడి పడేసిన బీరు బాటిల్ మూత సహాయం చేసింది. బీరు సీసా మూత నిందితులను పట్టించింది. దీని సాయంతో బెంగళూరులోని మిలీనియం బార్‌ వద్ద ఈనెల 16న అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులపై జరిగిన దాడి ఘటనను చంద్రాలేఔట్‌ పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు పాల్పడిన అప్రోజ్‌, రాకేశ్‌, రాజు, ఆదిల్‌ పాషా అనే నిందితులను అరెస్టు చేశారు.

కర్ణాటక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిథున్‌రాజ్‌, ముత్తురాజ్‌ అనే స్నేహితులు ఆటోలో పాటలు పెట్టుకొని మాట్లాడుకుంటుండగా రెండు బైక్‌ల్లో వచ్చిన నిందితులు బీరు బాటిళ్లతో తలలపై దాడి చేసి పారిపోయారు. బాధితులు రక్తం మడుగులో పడి ఉండగా ఆస్పత్రికి తరలించారు. చంద్రలేఔట్‌ ఎస్‌ఐ రవీశ్‌ కేసు దర్యాప్తు చేపట్టారు.

రూ. 28 లక్షల క్యాష్ బ్యాగ్ బస్సులో పెట్టి టిఫెన్ కోసం దిగిన ప్రయాణికుడు, తీరా వచ్చి చూసేసరికి షాక్, లబోదిబోమంటూ స్టేషన్‌కి పరుగులు

సీసీకెమెరాల్లో కూడా నిందితుల కదలికలు లేవు. కేవలం ఘటన స్థలిలో బీరు బాటిల్‌ మూత లభించింది. బ్యాచ్‌ నంబర్‌ ఆధారంగా కొనుగోలు చేసిన బార్‌ ఆచూకీ లభించింది. అక్కడకు వెళ్లి సీసీకెమెరా పరిశీలించగా నిందితులు బీర్లు కొనుగోలు చేసి బైక్‌లో వెళుతున్న దృశ్యాలు కనిపించాయి. గాలింపు చేపట్టి నిందితులను అరెస్ట్‌ చేశారు. కాగా ఎందుకు దాడికి పాల్పడ్డారని ప్రశ్నించగా ఊరికేనే దాడి చేసినట్లు నిందితులు తెలిపినట్లు పోలీసులు తెలిపారు.