Karnataka Shocker: వ్యక్తిగత సమస్యలు, కిరాయి రౌడీలకు సుపారీ ఇచ్చి కన్న కొడుకును చంపించిన కసాయి తండ్రి, శవాన్ని చెరుకుతోటలో పూడ్చి..మిస్సయ్యాడంటూ పోలీసులకు ఫిర్యాదు

ఆరుగురికి సుపారీ ఇచ్చి మరీ కొడుకును దారుణంగా హత్య చేయించాడు. . కర్ణాటకలోని హుబ్లీలో ఈ దారుణం చోటు చేసుకుంది.

Murder (Photo Credits: Pixabay)

Bengaluru, Dec 9: కర్ణాటకలోని హుబ్లీ పట్టణంలో కన్న తండ్రో కొడుకును కిరాయి రౌడీలతో దారుణంగా చంపించాడు. ఆరుగురికి సుపారీ ఇచ్చి మరీ కొడుకును దారుణంగా హత్య చేయించాడు. . కర్ణాటకలోని హుబ్లీలో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 26 ఏళ్ల అఖిల్ (26-year-old Son) జ్యుయలరీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అయితే తన కుమారుడు అదృశ్యమయ్యాడంటూ అఖిల్‌ తండ్రి భరత్ మహాజన్‌శెట్టి (Karnataka Father) ఈ నెల 3న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కొన్ని రోజుల తర్వాత తన కుమారుడు ఫోన్‌ చేశాడని, ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పాడంటూ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో తండ్రి తీరుపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ కుటుంబ సభ్యులందరినీ ప్రశ్నించారు. కొన్ని ఆధారాలు లభించిన తర్వాత తండ్రి భరత్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.వ్యక్తిగత కారణాల వల్ల కాంట్రాక్ట్‌ కిల్లర్స్‌కు సుపారీ ఇచ్చి కుమారుడ్ని హత్య చేయించినట్లు తండ్రి ఒప్పుకున్నాడు.

యూపీలో దారుణం, భార్య రెండోసారి శృంగారానికి ఒప్పుకోలేదని చంపేసిన భర్త, శవాన్ని ఎవరికి తెలియకుండా అడవిలో పడేసిన నిందితుడు, పోలీసుల విచారణలో నిజం వెలుగులోకి..

ఈ నెల 1న కుమారుడు అఖిల్‌ను తానే స్వయంగా ఆరుగురు కిల్లర్స్‌కు (Hired 6 People To Kill son) అప్పగించి ఒంటరిగా ఇంటికి తిరిగి వెళ్లినట్లు తెలిపాడు. కిల్లర్లు అతడ్ని హత్య చేసి దేవికొప్పలోని చెరకు పొలాల వద్ద మృతదేహాన్ని పాతిపెట్టినట్లు చెప్పాడు. పోలీసులు బుధవారం ఆ ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీయించారు. కిమ్స్‌ ఫోరెన్సిక్ వైద్య నిఫుణులతో పోస్ట్‌మార్టం చేయించారు. మృతుడి తండ్రి భరత్‌తోపాటు ఆరుగురు కాంట్రాక్ట్‌ కిల్లర్స్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అఖిల్‌ హత్య కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఇందులో మరి కొంతమంది పాత్ర కూడా ఉండవచ్చని పోలీస్‌ అధికారి తెలిపారు.

హైదరాబాద్‌లో సీన్ రివర్స్, పెళ్లి చేసుకోమన్న ప్రియుడిపై బ్లేడుతో దాడి చేసిన యువతి, నరాలు తెగడంతో 50 కుట్లు, నిందితురాలిపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు

ఘటనపై పోలీస్ కమిషనర్ హుబ్బళ్లి లాభూరాం మాట్లాడుతూ.. డిసెంబర్ 1న అఖిల్ అనే నగల వ్యాపారి హత్యకు గురయ్యాడని.. అతని మామ డిసెంబర్ 3న మిస్సింగ్ కేసు పెట్టారని, ఇది తప్పుదోవ పట్టించేదని, కుటుంబ సభ్యులను, మృతుడి తండ్రిని విచారణ జరిపించగా.. హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. తన కొడుకును చంపడానికి ఆరుగురిని నియమించానని తెలిపాడని అన్నారు."వ్యక్తిగత సమస్యల కారణంగా హత్య జరిగింది" అయితే మరిన్ని వివరాలను వెల్లడించలేదని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

హత్య జరిగిన రోజు అఖిల్ మృతదేహాన్ని నిందితులు కలఘట్గి సమీపంలోని దేవికొప్పలోని చెరకుతోటలో పూడ్చిపెట్టారని కమిషనర్ తెలిపారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అశోక్ సమక్షంలో బుధవారం అఖిల్ (26) మృతదేహాన్ని అన్ని పద్దతులు అనుసరించి బయటకు తీశారు. కర్ణాటక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్), ఫోరెన్సిక్ సైన్స్ వింగ్‌కు చెందిన నిపుణుల బృందం ఘటనా స్థలంలో పోస్టుమార్టం నిర్వహించారు.

హుబ్లీలోని రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లోని నిపుణులు హత్య కేసుకు సంబంధించి కీలక సమాచారాన్ని సేకరించారని పోలీసులు తెలిపారు.శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగిలిన ఆరుగురు నిందితులను మహదేవ్ నల్వాడ్, సలీమ్ సలావుద్దీన్ మౌల్వీ, రెహ్మాన్ విజాపూర్, ప్రభయ్య హిరేమత్, మహ్మద్ హనీఫ్‌లు హుబ్బళ్లి వాసులుగా పోలీసులు గుర్తించారు.