Zika Virus: కర్ణాటకలో జికా వైరస్ కలకలం, ఐదేండ్ల చిన్నారికి సోకిన వైరస్, రాష్ట్రంలో ఇదే తొలి కేసు అని అని నిర్థారించిన ఆరోగ్యశాఖ, లక్షణాలు, చికిత్స ఏంటంటే..
కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో జికా వైరస్ కలకలం రేపింది. జిల్లాలో ఐదేండ్ల చిన్నారికి జికా వైరస్ (Zika Virus Case) సోకినట్లు తేలింది. డెంగ్యూ, చికున్ గున్యా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ఈ నెల 5న ముగ్గురు పేషెంట్ల నుంచి సీరమ్ శాంపిల్స్ సేకరించి పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. ఇటీవల పరీక్షలకు సంబంధించిన రిజల్ట్స్ వచ్చాయి.
Bengaluru, Dec 12: కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో జికా వైరస్ కలకలం రేపింది. జిల్లాలో ఐదేండ్ల చిన్నారికి జికా వైరస్ (Zika Virus Case) సోకినట్లు తేలింది. డెంగ్యూ, చికున్ గున్యా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ఈ నెల 5న ముగ్గురు పేషెంట్ల నుంచి సీరమ్ శాంపిల్స్ సేకరించి పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. ఇటీవల పరీక్షలకు సంబంధించిన రిజల్ట్స్ వచ్చాయి.
మూడు శాంపిల్స్‌లో రెండు నెగెటివ్ రాగా, మరొకటి పాజిటివ్‌గా వచ్చింది. ఓ ఐదేండ్ల పాపలో జికా వైరస్ (Tests Positive For Zika Virus) ఉన్నట్లు బయటపడింది. కర్ణాటకలో ఇదే తొలి జికా కేసు అని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ తెలిపారు. అయితే దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నదని ఆయన తెలిపారు.
జికా వైరస్ దోమ కాటు వలన మనుషులకు వ్యాప్తి చెందుతుంది.దూకుడుగా ఉండే ఈడిస్ ఈజిప్ట్ దోమ ద్వారా ఈ వైరస్ సోకుతుంది. నిజానికి ఎల్లో ఫీవర్, వెస్ట్‌నైల్ చికన్‌గన్యా, డెంగ్యూ వంటి వైరస్‌ల కుటుంబానికి చెందినదే జికా. ఆఫ్రికాలో బయలుదేరిన ఈ వైరస్. క్రమంగా లాటిన్ అమెరికా, పలు యూరప్ దేశాలకు విస్తరించింది.జికా వైరస్ సోకిన రోగికి వ్యాధి నయం చేసే మందులు లేవు.జికా వైరస్ సోకితే ఆరోగ్య సమస్యలు తప్పవు.
ముఖ్యంగా గర్భిణీలు ఈ వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీలకు ఈ వైరస్ సోకితే పుట్టే పిల్లలు తక్కువ సైజులో పుడతారు. వారి మెదడు పూర్తిగా అభివృద్ధి చెందదు. జికా వైరస్ సోకిన గర్భిణీలకు చాలా వరకూ ఇలానే పిల్లలు పుట్టారు. దీంతో గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
ఎక్కువగా దోమల కారణంగా వ్యాపిస్తుంది జికా వైరస్. దీంతో పాటు లైంగిక సంబంధాలు కూడా మరో కారణం. ఇక రక్త మార్పిడి ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ చెబుతోంది. అయితే ఇది నిర్ధారణ కాలేదు.ప్రపంచాన్ని వణికిస్తున్న జికా వైరస్ పై భారత దేశ కేంద్రప్రభుత్వ ఆరోగ్యశాఖ అప్రమత్తం అయింది. ఇప్పటికి ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ వైరస్ నలభై లక్షల మందికి సోకే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రధానంగా గర్భిణీలు తేలిగ్గా ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ధోమల కారణంగా ఈ వైరస్ వ్యాప్తి అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
ఈ వైరస్ సోకినవారికి జ్వరం, తలనొప్పి, వంటి మీద దద్దుర్లు, కండ్లు ఎర్రబారడం వంటి సాధారణ లక్షణాలు ఉంటాయి. దీనితో పరిస్థితి ముదిరిపోయేదాకా దీనిని గుర్తించడం కష్టమవుతుంది. చాలామందిలో బయటకు ఎటువంటి లక్షణాలు కన్పించకపోవచ్చును.కాకపోతే కొద్దిపాటి జ్వరం, వంటిపై దద్దుర్లు, కీళ్ళనొప్పులు, కళ్ళకలక (కళ్ళుఎర్రబడటం) వంతివి కనబడతాయి.కొంతమందికి కండరాలనొప్పులు కనిపించ వచ్చును. కొందరిలో తలనొప్పి ఉంటుంది.ఓకసారి వైరస్ సోకాక లక్షణాలు కనిపించటానికి కొద్ది రోజులు మొదలుకొని కొన్ని వారాలు పట్టవచ్చును.వైరస్ సోకితే అది వ్యాధికి గురైన వారి రక్తంలో కొన్ని రోజులు మొదలుకొని, కొన్నాళ్ళవరకు ఉండవచ్చును.అంటే లక్షణాలు బయటకు కనిపించకపోయినా, వ్యాధి వ్యాపింపచేసె పరిస్థితిలో వారుంటారు.
వ్యాధి సోకినపుడు ఏర్పడె వ్యాధి లక్షణాలు ప్రాణాంతకం కాదు, సాధారణ తలనొప్పులు, వళ్లునొప్పులే, అయితే వ్యాధిసోకిన తర్వాత కలిగే దశలు చాలా ప్రమాదకరమైనవి.అవి సరీర/దేహ రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీసేఆటో ఇమ్మ్యూన్ వ్యాధులను కలగజేయవచ్చు.ఆతరువాత రోగికి గులియన్ బ్యారీ సిండ్రోమ్, మొదడు కుంచించుకుపోయే మైక్రోసెఫాలీ వంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడ వచ్చు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
జికా వైరస్ చాలా వరకూ దోమల కారణంగా వస్తుంది. కాబట్టి.. దోమలు కుట్టకుండా జాగ్రత్త పడాలి. నిండుగా బట్టలు వేసుకోవాలి. వీలైనంత వరకూ ఇంటి తలుపులు, కిటికీలకు మెష్‌ని పెట్టించడం మంచిది. అదే విధంగా దోమల వికర్షణ లేపనాలు వాడడం మంచిది. వైరస్ సోకిన వారికి దూరంగా ఉండాలి. వారిని ముద్దుపెట్టుకోవడం, ముట్టుకోవడం, లైంగిక కార్యక్రమాలకి పాల్పడడం చేయకూడదు. వారి దగ్గరికి వెళ్ళి వచ్చాక కచ్చితంగా చేతులను శుభ్రంగా కడగాలి. మాస్క్ వాడుతుండాలి. ఇంటిని, ఇంటి పరిసరాలను శుభ్రం చేస్తుండాలి. అదే విధంగా నీటి నిల్వలు లేకండా చూసుకోవాలి. చుట్టూ ఉన్న పరిసరాల్లో చెత్త పేరుకోకుండా చూసుకోవాలి. దోమల తెరలు వాడాలి.
చికిత్స ఏంటంటే..
వ్యాధిసోకిన తరువాత నిర్దిష్త చికిత్స ప్రక్రియ లేదు.ఇతర వైరల్ జబ్బుల విషయంలో ఇచ్చే మందులే దీనికి ఇస్తారు.ఇప్పటివరకు జికా వైరస్‌కి ప్రత్యేకంగా మందులు కానీ, వ్యాక్సిన్లు కానీ లేవు. బాగా విశ్రాంతి తీసుకోవాలి. శరీరం డీ హైడ్రేషన్‌కి గురికాకుండా ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.జ్వరం, నొప్పులను తగ్గించే మందులు వాడాలి.యాస్ప్రిన్ గానీ, ఇంకా ఇతర నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ అంటే ఇబుప్రొఫెన్, న్యాప్రాక్సెన్ లాంటివి వాడకూడదు. డెంగ్యూ, జికా లక్షణాలు లేవని తేలేవరకు ఈ మందులను వాడకూడదు.
అలా వాడితే రక్తస్రావం ప్రమాదం ఉంటుంది.మరేదైనా అనారోగ్యానికి మందులు వాడుతున్నవారు కూడా డాక్టరుని సంప్రదించాకే మందులు వేసుకోవాలి.జికా లక్షణాలున్నవారికి ఒక వారం వరకు మళ్లీ మళ్లీ దోమలు కుట్టకుండా జాగ్రత్తపడాలి. ఎందుకంటే ఇన్‌ఫెక్షన్ సోకిన మొదటివారంలో రక్తంలో జికా వైరస్ ఉంటుంది. దోమలు మళ్లీ కుట్టినపుడు ఆ వైరస్ వాటి ద్వారా తిరిగి మరొక వ్యక్తికి సంక్రమించవచ్చు. ఇన్‌ఫెక్షన్‌కి కారణమయ్యే వైరస్‌ని మోసుకువెళ్లే దోమ అది కుట్టినవారికి దాన్నివ్యాపింపచేస్తుంది.
తగినంత విశ్త్రాంతి తీసుకోవాలి.ద్రవ ఆహారాని ఎక్కువ తీసుకోవడం వలన డిహైడ్రెసన్ తగ్గించవచ్చును.జ్వరాన్ని తగ్గించూ అసిటమినొపెన్ (acetaminophen) వంటి మందుమాత్రలు వాడాలి.అస్ప్రిన్, నాన్ స్టెరీయోడల్ (non-steroidal), నొప్పినివారణమందులు (anti-inflammatory ) వాడరాదు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)