Man Bites off Wife’s Finger: దారుణం, భార్య అందుకు ఒప్పుకోలేదని ఆమె వేళ్లు కొరికి తినేసిన భర్త, రాకపోతే చంపి ఇదే విధంగా తినేస్తానని బెదిరింపులు

భార్యతో గొడవపడిన భర్త.. ఆమె వేలిని కొరికి ఉమ్మేశాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన విజయ్ కుమార్ కు భార్య పేరు పుష్ప ఒక కుమారుడు ఉన్నాడు.

Representational Image (Photo Credits: Pexels)

Bengaluru, August 4: బెంగుళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యతో గొడవపడిన భర్త.. ఆమె వేలిని కొరికి ఉమ్మేశాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన విజయ్ కుమార్ కు భార్య పేరు పుష్ప ఒక కుమారుడు ఉన్నాడు. వీరికి పెళ్లయి 23 ఏళ్లు కావస్తున్న వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో వారిద్దరూ అభిప్రాయ బేధాల కారణంగా విడిపోయి విడివిడిగా జీవిస్తున్నారు. విజయ్ కుమార్ తన కుమారుడితో కలిసి ఉంటున్నాడు.

ఒంటిమిట్ట రాములోరి గుడిలో యువకుడి దారుణం.. స్నానం చేస్తున్న మహిళా భక్తుల న్యూడ్ వీడియోల రికార్డింగ్.. బాత్రూం వెంటిలేటర్ నుంచి సెల్‌ ఫోన్‌ లో రికార్డింగ్.. కేకలు వేయడంతో పరార్

కొన్నేళ్ల నుంచి విజయ్‌కుమార్‌ భార్యను వేధిస్తుండటంతో ఆమె వేరుగా ఉంటోంది. గత నెల 28న విజయ్‌కుమార్‌ ఆమె వద్దకు వెళ్లి ఘర్షణకు దిగాడు. కోపం పట్టలేక ఆమెపై దాడి చేసి ఎడమ చేతి వేళ్లు కొరికి తినేశాడు. తన వద్దకు రాకపోతే ఆమెను చంపి ఇదే విధంగా తినేస్తానని బెదిరించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విజయ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.



సంబంధిత వార్తలు