Karnataka: టిప్పు సుల్తాన్‌ను ముస్లిం గుండా అంటే నాలుక కోసి పడేస్తాం, బీజేపీ మంత్రి ఈశ్వరప్పకు బెదిరింపు లేఖ, పోలీసులకు ఫిర్యాదు చేసిన కర్ణాటక ఎమ్మెల్యే

ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన బ్యానర్లలో టిప్పు సుల్తాన్, వీర సావర్కర్‌ల ఫొటోలు ఉండడం అక్కడ తీవ్ర దుమారం రేపింది.

Karnataka BJP MLA KS Eshwarappa (File Photo/ANI)

Bengaluru, August 25: కర్నాటకలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చోటుచేసుకున్న వేడి వేడి ఇంకా చల్లరలేదు. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన బ్యానర్లలో టిప్పు సుల్తాన్, VD సావర్కర్‌ల ఫొటోలు ఉండడం అక్కడ తీవ్ర దుమారం రేపింది. వీటిని ఏర్పాటు చేసిన బీజేపీ ఎమ్మెల్యే, మంత్రి కేఎస్ ఈశ్వరప్ప (Karnataka Minister KS Eshwarappa) ముస్లిం యువకులను టార్గెట్‌ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరప్పకు ఓ బెదిరింపు లేఖ (Threat Letter over His Remarks on Tipu Sultan) వచ్చింది. టిప్పు సుల్తాన్‌ను మరోసారి ‘ముస్లిం గుండా’ అని పిలిస్తే నాలుక కోస్తానని బెదిరింపు లేఖలో సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. దీంతో, ఈశ్వరప్ప పోలీసులను ఆశ్రయించి.. బెదిరింపు లేఖపై స్టేషన్‌లో ఫిర్యాదు (Files Complaint) చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు చిన్నారులు సహా 9 మంది మృతి, వేగంగా వచ్చి ఢీకొట్టిన లారీ, డ్రైవర్ నిద్రమత్తే కారణమంటున్న ప్రత్యక్ష సాక్షులు

ఇదిలా ఉండగా, బెదిరింపు లేఖపై బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరప్ప మాట్లాడుతూ..‘ముస్లిం పెద్దలకు నేను చెప్పేది ఒక్కటే.. ముస్లింలందరూ గుండాలు అని అనలేదు. ముస్లిం సమాజంలోని పెద్దలు గతంలో శాంతి కోసం ప్రయత్నాలు చేశారు. కొందరు యువత గుండాయిజంలో మునిగిపోతున్నారు. వారికి మాత్రమే సలహా ఇవ్వాలని నేను చెప్పాలనుకుంటున్నాను. లేని పక్షంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి’ అని స్పష్టం చేశారు. తాను ఇలాంటి బెదిరింపులకు భయపడనని ఈశ్వరప్ప కౌంటర్‌ ఇచ్చారు.



సంబంధిత వార్తలు

Vijay on Amit Shah Comments: డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడిన హీరో విజయ్, కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే ఎలర్జీ అని వెల్లడి

CM Siddaramaiah: అమిత్ షా వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాతను అవమానించడమే, వీడియోని షేర్ చేస్తూ మండిపడిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

Parliament Winter Session 2024: బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతూ రాజీనామా చేయాల్సిందేనని ఇండియా కూటమి డిమాండ్, కాంగ్రెస్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని మండిపడిన బీజేపీ, వేడెక్కిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

Telangana Assembly Sessions: మంత్రులే ప్రశ్నలు అడుగుతారా?, మూసీని మురికి కూపం చేసిందే కాంగ్రెస్..హరీశ్‌ రావు ఫైర్, అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం అన్న మంత్రి ఉత్తమ్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif