Karnataka: భార్య లేని సమయంలో కూతుర్లపై పోలీస్ అధికారి అత్యాచారం, అంతటితో ఆగకుండా మరదలిని గర్భవతి చేసిన కామాంధుడు, భర్త నేరాలపై సీబీఐ దర్యాప్తు కోరిన పోలీస్ భార్య
అంతే కాకుండా తన భార్య చెల్లెలిని గర్భవతిని చేశాడు. దీంతో భర్త తీరుపై విసుగు చెందిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Bengaluru, July 4: బెంగుళూరులో ఓ పోలీస్ అధికారి తన సవతి కూతుళ్లపై లైంగిక దాడికి (Police Inspector allegedly raped stepdaughters) పాల్పడ్డాడు. అంతే కాకుండా తన భార్య చెల్లెలిని గర్భవతిని చేశాడు. దీంతో భర్త తీరుపై విసుగు చెందిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడి నేరాలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఒక మహిళ 2005లో భర్తతో విడాకులు తీసుకుంది. అనంతరం పోలీస్ ఇన్స్‌స్పెక్టర్ టీఆర్ శ్రీనివాస్‌తో ( Police Inspector) ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆమె ఇద్దరి కుమార్తెల బాధ్యతలను తాను చూసుకుంటానని హామీ ఇచ్చిన ఆ పోలీస్ అధికారి 2012లో ఆ మహిళను పెళ్లి చేసుకున్నాడు.
కాగా, కొంత కాలం తర్వాత తన భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిందని భార్య ఆరోపించింది. ఫోర్న్ సినిమాలు చూడాలని బలవంతం చేసేవాడని, తనను కట్టేసి కొట్టేవాడని తెలిపింది. తాను ఇంటి వద్ద లేని సమయంలో తన సోదరి, ఇద్దరు కుమార్తెలను తన భర్త లైంగికంగా వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తన చెల్లెల్లు గర్భం దాల్చినట్లు పేర్కొంది. జూన్ 1న జేసీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీస్ అధికారి అయిన తన భర్తపై ఎలాంటి చర్యలు తీసుకోలేని ఆ మహిళ ఆరోపించింది. అయితే ఆయనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లుగా తనపై కేసు నమోదు చేసి వేధిస్తున్నారని వాపోయింది.
మరోవైపు పోలీస్ అధికారి అయిన భర్త నేరాలపై సీబీఐ దర్యాప్తును (Wife seeks CBI probe) కోరుతూ ఆ మహిళ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. ఆమె పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ప్రభుత్వానికి నోటీస్ జారీ చేసింది. ఈ కేసుపై తీసుకున్న చర్యలపై సమాధానం ఇవ్వాలని హోంశాఖను ఆదేశించింది.