Kerala Rains: కేరళను వణికిస్తున్న భారీ వర్షాలు, పెరుగుతున్న మృతుల సంఖ్య, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 21కి చేరిన మరణాల సంఖ్య

కేరళను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కూట్టిక్కల్, కొట్టాయం జిల్లాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో శిథిలాల నుంచి మరికొన్ని మృతదేహాలు ఆదివారం వెలిగి తీశారు. దీంతో ఇంతవరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 21కి (Death Toll Due Heavy Rainfall and Landslides Rises to 21) చేరింది.

Kerala Rains. (Photo Credits: ANI)

Thiruvananthapuram, October 17: కేరళను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కూట్టిక్కల్, కొట్టాయం జిల్లాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో శిథిలాల నుంచి మరికొన్ని మృతదేహాలు ఆదివారం వెలిగి తీశారు. దీంతో ఇంతవరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 21కి (Death Toll Due Heavy Rainfall and Landslides Rises to 21) చేరింది. కొట్టాయంలో 13, ఇడుక్కిలో 8 మంది మృతి చెందినట్టు రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖ తెలిపింది. భారత వైమానిక, సైనిక, ఎన్‌డీఆర్‌ఎఫ్, పోలీసు బలగాలు, అగ్నిమాపక సిబ్బంది సహా స్థానికులు సహాయక చర్చలు ముమ్మరం చేశారు. కొట్టిక్కల్, కొక్కయార్ పంచాయతీల పరిధిలో డజను మందికి పైగా జాడ గల్లంతైనట్టు చెబుతున్నారు.

కాగా, రాష్ట్రంలోని 6 జిల్లాల్లో రెడ్ అలర్ట్, మరో 6 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్, రెండు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాలతో అతలాకతులమైన ప్రాంతాల్లోని టూరిస్టు కేంద్రాలను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ మూసివేయాలని, బోటింగ్ సర్వీసును కూడా సస్పెండ్ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కేరళలో భారీ వర్షాలు, వరదల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, సహాయ కార్యక్రమాలతో సహా బాధితులను అన్నిరకాలా ఆదుకుంటామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఓ ట్వీట్‌లో తెలిపారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement