Idukki Landslide: కుప్పలుగా బయటపడుతున్న శవాలు, రాజమాలలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 62కి చేరిన మృతుల సంఖ్య, రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేరళ సీఎం, పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ.2 లక్షలు

ఆగస్టు 7న ఇడుక్కి జిల్లాలో ఈ సంఘటన జరగ్గా ఇప్పటివరకు మృతుల సంఖ్య 62కు (Idukki landslide rises to 62) చేరింది. శిథిలాల నుంచి నిన్న ఓ తొమ్మిదేళ్ల బాలుడి మృతదేహం వెలికి తీయడంతో మృతుల సంఖ్య పెరిగిందని స్థానిక అధికారులు తెలిపారు. కాగా, ఇప్పటికీ మరో ఎనిమిది మంది ఆచూకీ తెలియాల్సి ఉందని వారు పేర్కొన్నారు. అయితే వారి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనతో అనేక మంది ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు.

Landslide (Representational Image|ANI)

Thiruvananthapuram. August 20: కేరళలోని ఇడుక్కి జిల్లాలోని రాజమాలలో కుండపోత వర్షాలకు కొండ చరియలు విరిగి పడిన ఘటనలో (Kerala Rajamala landlside) మృతదేహాలు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. ఆగస్టు 7న ఇడుక్కి జిల్లాలో ఈ సంఘటన జరగ్గా ఇప్పటివరకు మృతుల సంఖ్య 62కు (Idukki landslide rises to 62) చేరింది. శిథిలాల నుంచి నిన్న ఓ తొమ్మిదేళ్ల బాలుడి మృతదేహం వెలికి తీయడంతో మృతుల సంఖ్య పెరిగిందని స్థానిక అధికారులు తెలిపారు. కాగా, ఇప్పటికీ మరో ఎనిమిది మంది ఆచూకీ తెలియాల్సి ఉందని వారు పేర్కొన్నారు. అయితే వారి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనతో అనేక మంది ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు.

కొండచరియ నివాసితుల పునరావాసానికి ప్రభుత్వం భరోసా ఇస్తుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Chief Minister Pinarayi Vijayan) అన్నారు. జిల్లా సమాచార కార్యాలయం నుంచి రెండు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, ఇడుక్కి ఫైర్ అండ్ రెస్క్యూ టీం పూర్తి యూనిట్, కొట్టాయం, తిరువనంతపురం నుంచి ఒక్కో బృందం, ప్రత్యేక శిక్షణ పొందిన ఇతర బృందాలు ప్రస్తుతం రాజమాలలో సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఓ వైపు కరోనా..మరోవైపు వర్ష విలయం

మరణించిన వారి బంధువులకు సీఎం విజయన్ రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియాను ప్రకటించగా, ప్రధాని నరేంద్ర మోదీ కూడా పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. కేరళలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో పలు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి.

Update By ANI

ఇదిలా ఉంటే కేరళలో వర్షాలు, వరదల కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయిన ప్రాంతాల్లో ఉన్న కరోనా వైరస్‌ సోకిన వారికి కేరళ ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. వర్షాల కారణంగా రావాణా మార్గాలు దెబ్బతిన్న ప్రాంతాల్లో నివసిస్తున్న అనేక మంది కరోనా వైరస్‌ పేషెంట్లను ఆస్పత్రికి తరలించేందుకు రెస్య్కూ బోట్లను అంబులెన్స్‌లుగా మార్చింది. రాష్ట్ర జల రవాణా శాఖ ఈ ఆలోచన సత్ఫలితాలను ఇస్తోందని విజిలెన్స్‌ వింగ్‌ ఇన్స్పెక్టర్‌ సంతోష్‌ కుమార్‌ తెలిపారు.

ఇక పోతే భారత్‌లో తొలి కోవిడ్‌ కేసు వెలుగు చూసిన కేరళలో సోమవారం కొత్తగా 1,725 కేసులు నమోదయ్యాయి. మొత్తం 46,140 మంది కరోనా బారిన పడగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 15,946 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 30,025 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు కేవలం 169 మంది మృత్యువాత పడ్డారు.