Kerala Shocker: ప్రియుడా లేక ఉన్మాదా..తరగతి గదిలోనే ప్రియురాలు గొంతు కోసి చంపేసిన లవర్, పోలీసులు వచ్చే దాకా అలాగే శవం ముందు ఉన్న శాడిస్ట్, కేరళలో దారుణ ఘటన
తాజాగా కేరళలోని కొట్టాయం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాలేజీ తరగతి గదిలో గర్ల్ ఫ్రెండ్‌తో గొడవపడిన ఓ విద్యార్థి విచక్షణారహితంగా అక్కడే ఆమె గొంతుకోసి (Man Slits Girlfriend’s Throat) చంపేశాడు.
Kottayam, Oct 1: ప్రేమికులు చిన్న చిన్న విషయాలకు గొడవపడుతూ ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా కేరళలోని కొట్టాయం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాలేజీ తరగతి గదిలో గర్ల్ ఫ్రెండ్‌తో గొడవపడిన ఓ విద్యార్థి విచక్షణారహితంగా అక్కడే ఆమె గొంతుకోసి (Man Slits Girlfriend’s Throat) చంపేశాడు. ఆ తర్వాత పారిపోకుండా పోలీసులు వచ్చేదాకా అక్కడే ఎదురుచూసి (Then Patiently Waits For Cops) వారికి లొంగిపోయాడు.
కేరళ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కొట్టాయం జిల్లాకు చెందిన 22ఏళ్ల నిధినా మోల్ స్థానిక సెయింట్ థామస్ కాలేజీలో చదువుతోంది. అక్కడ తనతో పాటే చదువుతున్న అభిషేక్‌తో పరిచయం ప్రేమకు దారితీసింది. అయితే ఇటీవల వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఇదే విషయమై శుక్రవారం తరగతిలోనే వీరిద్దరూ గొడవపడ్డారు. ఈ క్రమంలో నిధినాపై ఆగ్రహానికి లోనైన అభిషేక్.. అక్కడే ఉన్న పేపర్లు కట్ చేసే కత్తి తీసుకుని ఆమె గొంతు కోశాడు. దీంతో నిధినా అక్కడికక్కడే మృతి చెందింది.
ఈ ఘటనతో విద్యార్థులంతా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే నిధినాను చంపేసిన తర్వాత అభిషేక్ ఏ మాత్రం భయపడలేదని, ఎక్కడికి పారిపోకుండా పోలీసులు వచ్చేంతవరకూ బెంచీ మీదే కూర్చున్నాడని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు.