Trans Man gets Pregnant: అవును అతను 8 నెలల ప్రెగ్నెంట్, త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న ట్రాన్స్ జెండర్, పెళ్లికోసం ఆమెగా మారిన అతడు, పురుషుడిగా మారిన యువతి
జియా పురుషుడిగా జన్మించగా.. స్త్రీగా మారాడు. అయితే జహాద్ స్త్రీగా జన్మించగా… తరువాత పురుషుడిగా మారాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నాడు. కానీ ఈ సర్జరీలో అతని గర్భాశయం, మరికొన్ని అవయవాలు తొలగించలేదు. ఈ క్రమంలోనే అతడు గర్భవతి అయ్యాడు.
Kozhikode, FEB 04: కేరళ రాష్ట్రం కోజికోడ్‌కు చెందిన జియా (Ziya)- జహద్ (Zahad) అనే ట్రాన్స్‌జెండర్ (trans man gets pregnant) జంట శుభవార్త చెప్పింది. త్వరలో తాము తల్లిదండ్రులు కాబోతున్నామంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. మార్చి నెలలో తమ తొలిబిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలిపింది. గత మూడేళ్లుగా సహజీవనం చేస్తున్న ఈ జంట బుధవారం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ సంతోషకరమైన వార్తను ప్రకటించింది. 'నేను పుట్టుకతో స్త్రీని కానప్పటికీ, ఒక శిశువు నన్ను ‘అమ్మా’ అని పిలవాలనే కల నాలో ఉంది. మేము కలిసి మూడు సంవత్సరాలు అయ్యింది. తల్లి కావాలని నేను, తండ్రి కావాలని అతను (Zahad) కలలు కన్నాం. ఆ కల త్వరలో నెరవేరబోతోంది. అతని కడుపులో ఎనిమిది నెలల జీవం ప్రాణం పోసుకుంటోంది’ అని అమ్మాయిలా మారిన జియా పావెల్ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.
అయితే ఓ ట్రాన్స్‌జెండర్ జంట బిడ్డకు జన్మనివ్వడం (trans man gets pregnant) దేశంలోనే ఇదే తొలిసారి. అయితే, సంతానం కోసం.. అబ్బాయిగా మారే చికిత్సను జహాద్ వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ట్రాన్స్ జెండర్ల జంట తమ లింగాన్ని మార్చుకోవడానికి శస్త్ర చికిత్సను ఆశ్రయించారు. జియా పురుషుడిగా జన్మించగా.. స్త్రీగా మారాడు. అయితే జహాద్ స్త్రీగా జన్మించగా… తరువాత పురుషుడిగా మారాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నాడు. కానీ ఈ సర్జరీలో అతని గర్భాశయం, మరికొన్ని అవయవాలు తొలగించలేదు. ఈ క్రమంలోనే అతడు గర్భవతి అయ్యాడు.