Wayanad Landslides Live Updates: వాయనాడ్‌లో కొనసాగుతున్న సహాయ చర్యలు, పెరుగుతున్న మృతుల సంఖ్య, బాధితులకు రాహుల్ గాంధీ పరామర్శ
భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 200 మందికి పైగా మృతదేహాలు వెలికితీయగా శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం రెస్య్కూ కొనసాగుతోంది.
Kerala, Aug 1: కేరళను భారీ వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 200 మందికి పైగా మృతదేహాలు వెలికితీయగా శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం రెస్య్కూ కొనసాగుతోంది.
ఇక ఇవాళ భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలైన వయనాడ్‌తో పాటు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. తన సోదరి ప్రియాంకతో కలిసి ఢిల్లీ నుండి వయనాడ్‌కు బయలుదేరారు రాహుల్. వయనాడ్ నుండే రాహుల్ రెండుసార్లు ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే. వయనాడ్ కొండచరియలు విరిగి పడిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సైతం మృతులకు నివాళులు అర్పించింది. ఇక ఇవాళ ప్రియాకంతో కలిసి బాధితులో మాట్లాడి వారిలో ధైర్యాన్ని నింపనున్నారు రాహుల్. అలాగే పునరావాస శిబిరాలను సందర్శించనున్నారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు.
గల్లంతైన వారి కోసం డిఫెన్స్ సెక్యూరిటీ కోర్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు. కేరళలోని అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. రెండు రోజుల సహాయక చర్యల్లో 1592 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని కేరళ సీఎం పినరయి విజయన్ వెల్లడించారు. ఇదే సమయంలో కేంద్రమంత్రి అమిత్ షా వాఖ్యలను ఆయన ఖండించారు. వయనాడ్ మృత్యుఘోష, 164 మంది శిథిలాల కింద సజీవ సమాధి, ప్రధాని మోదీ నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపిన కేంద్ర మంత్రి రాయ్
ఆరు సంవత్సరాల క్రితమే ఇలాంటి కొండప్రాంతాల నుంచి ప్రజలను వేరేచోటుకు తరలించాలని ఢిల్లీ ఐఐటీ నిపుణులు హెచ్చరించారని అమిత్ షా చెప్పిన సంగతి తెలిసిందే. దీనిని కేరళ సర్కార్ పెడచెవిని పెట్టిందని తెలపగా అమిత్ షా చెప్పేదంతా అబద్ధం అన్నారు విజయన్. 28వ తేదీ వరకు ఎలాంటి అలర్ట్ పంపలేదని తేల్చిచెప్పారు.
Here's Video:
#WATCH | Wayanad Landslide | Kerala CM Pinarayi Vijayan travelling to Wayanad from Kozhikode. The chief secretary Dr V Venu and DGP, Shaik Darvesh Sahib are accompanying him