Kolkata Doctor case updates: కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసులో కీలక పరిణామం, బీజేపీ నేత సహా ఇద్దరు డాక్టర్లకు సమన్లు, ప్రధాన నిందితుడికి మానసిక పరీక్ష

ముఖ్యంగా కోల్ కతాలో మెడికల్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండగా దేశవ్యాప్తంగా వీరికి వైద్యులు, మెడికల్ కాలేజీ విద్యార్థులు సంఘీభావం చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన థియేటర్ ఆర్టిస్టులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం అర్ధరాత్రి మార్చ్‌తో నిరసనల్లో పాల్గొన్నారు.

Kolkata doctor-rape murder live updates, Bengal BJP Leader and two doctors summoned over fake news(X)

Kolkata, Aug 18:  కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసుల్లో దోషులను శిక్షించాలని దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతోంది. ముఖ్యంగా కోల్ కతాలో మెడికల్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండగా దేశవ్యాప్తంగా వీరికి వైద్యులు, మెడికల్ కాలేజీ విద్యార్థులు సంఘీభావం చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన థియేటర్ ఆర్టిస్టులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం అర్ధరాత్రి మార్చ్‌తో నిరసనల్లో పాల్గొన్నారు.

కోల్ కతా అత్యాచారం, హత్య ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మృతురాలి గుర్తింపును బయటపెట్టారని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారని బీజేపీ నేత సహా ఇద్దరు డాక్టర్లకు పోలీసులు సమన్లు అందజేశారు. బీజేపీ నేత మాజీ ఎంపీ లాకెట్ ఛటర్జీ,డాక్టర్ కునాల్ సర్కార్, డాక్టర్ సుబర్ణ గోస్వామిలకు పోలీసులు సమన్లు జారీ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలలోపు లాల్‌బజార్‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో హాజరుకావాలని ఆదేశించారు.

మరోవైపు కోల్‌కతా హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్‌కి సీబీఐ మానసిక పరీక్ష నిర్వహించనున్నారు పోలీసులు.  సీఎఫ్‌ఎస్‌ఎల్‌లోని ఐదుగురు నిపుణుల ఆధ్వర్యంలో మానసిక పరీక్ష జరగనుంది.

పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ ఆగస్టు 9న ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో చనిపోయిందని గుర్తించిన తర్వాత పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 14న కొంతమంది RG కర్ హాస్పిటల్ క్యాంపస్‌లోకి ప్రవేశించి ఆస్తులను ధ్వంసం చేశారు. కోల్‌కతాలో విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఆగస్టు 24 వరకు ఆర్‌జి కర్ ఆసుపత్రి దగ్గర ఎటువంటి సమావేశాలకు అనుమతిలేదని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా డాక్టర్ హత్యాచారంపై సీఎం మమతా బెనర్జీ నిరసన, నిందితులను ఉరి తీయాలని డిమాండ్ 

ఈ కేసులో సీబీఐ ఆగస్టు 17న సుమారు 13 గంటల విచారణ తర్వాత ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్‌ను విడుదల చేసింది. ఆగస్టు 16న కూడా 15 గంటల పాటు విచారించారు. ఇక ఇవాళ మూడో రోజు కూడా విచారణ చేపట్టనున్నారు. (శుక్రవారం) అధికారులచే.

కోల్‌కతాలో జరిగిన అత్యాచారం-హత్య ఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమాలు జరిగాయి. ద్యుల నిరసనపై ప్రతి 2 గంటలకు శాంతిభద్రతల నివేదిక పంపాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలను ఆదేశించింది. మరోవైపు సంఘటన జరిగిన రాత్రి ఆసుపత్రిలో విధుల్లో ఉన్న అందరి వాంగ్మూళాన్ని సీబీఐ క్రాస్ రిఫరెన్స్ చేసింది. జాబితాలో 40 మంది ఉండగా 20 మంది వ్యక్తులను కూడా సీబీఐ ప్రశ్నించింది.