Kota Kidnapping Case: రూ.30 లక్షల డబ్బు కోసం తండ్రితో కిడ్నాప్ నాటకం ఆడిన కూతురు, కాళ్లు తాడుతో కట్టేసి ఉన్న ఫొటోలను పంపి..
కొందరు వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి బంధించారని ఆరోపిస్తూ (Woman fakes kidnapping) చేతులు, కాళ్లు తాడుతో కట్టేసి ఉన్న ఫొటోలు తండ్రి మొబైల్‌కు పంపింది.
మధ్యప్రదేశ్‌లోని శివపురికి చెందిన 21 ఏళ్ల కావ్య అనే ఓ యువతి కిడ్నాప్ డ్రామా ఆడి తండ్రి నుండి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించి విఫలమైంది. కొందరు వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి బంధించారని ఆరోపిస్తూ (Woman fakes kidnapping) చేతులు, కాళ్లు తాడుతో కట్టేసి ఉన్న ఫొటోలు తండ్రి మొబైల్‌కు పంపింది. విడిపించేందుకు రూ.30 లక్షలు డిమాండ్ చేసింది. పెళ్ళైన యువతితో పారిపోయాడని యువకుడికి గుండు కొట్టించి మూత్రం తాగించిన స్థానికులు, సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఆమెను పోటీ పరీక్షల్లో శిక్షణ ఇచ్చేందుకు రాజస్థాన్ కోటాలోని కోచింగ్ సెంటర్‌లో తల్లిదండ్రులు చేర్చించారు. కుమార్తెతో పాటు మూడు రోజులు హాస్టల్‌లో ఉన్న ఆమె తల్లి తిరిగి మధ్యప్రదేశ్‌లోని సొంత ఊరికి వెళ్లిపోయింది.విదేశాలకు వెళ్లి అక్కడ చదువుకోవాలని ఆశతో కిడ్నాప్ తతంగం నడిపింది. మార్చి 18న కావ్య తండ్రి మొబైల్ ఫోన్‌కు అతడి కుమార్తెను తాళ్లతో బంధించి కిడ్నిప్ చేసినట్లుగా ఫోటోలు వచ్చాయి. ఆమెను విడిపించేందుకు రూ.30 లక్షలు ఇవ్వాలని మెసేజ్ పంపారు. కావ్య తండ్రి కుమార్తె కిడ్నాప్ గురించి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Here's Video and Pics
దర్యాప్తు చేసిన కోటా పోలీసులు కావ్య మూడు రోజుల్లోనే కోట నుంచి ఇండోర్‌కు వెళ్లినట్లు గుర్తించారు. ఇద్దరు మగ స్నేహితులతో కలిసి ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుసుకున్నారు. ఆమె స్నేహితురాలిని ప్రశ్నించిన తర్వాత కావ్య కిడ్నాప్ నకిలీ అని నిర్ధారించారు. కావ్య, ఇద్దరి మగ స్నేహితుల మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్‌లో ఉన్నాయని కోటా పోలీసులు తెలిపారు. శివపురి పోలీసులు కూడా ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కావ్య ఆచూకీని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.