Lalu Prasad Yadav Health: లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్యం విషమం, అయనా ప్రమాదం ఏమి లేదని తెలిపిన వైద్యులు, దాణా కుంభకోణం కేసులో 5 ఏళ్ళ జైలు శిక్ష విధించిన ప్రత్యేక సీబీఐ కోర్టు

దీంతో ఆయనను హుటాహుటీన రాజేంద్రన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌)లో చేర్పించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా (Lalu Prasad Yadav's health condition ) ఉన్నప్పటికీ.. ప్రమాదం ఏమీ లేదని వైద్యులు పేర్కొన్నారు.

RJD Chief Lalu Prasad Yadav | File Image | (Photo Credit: Facebook)

Ranchi, Feb 21: ఆర్జేడీ నేత, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తీవ్ర అస్వస్థతకు (Lalu Prasad Yadav Health) గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటీన రాజేంద్రన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌)లో చేర్పించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా (Lalu Prasad Yadav's health condition ) ఉన్నప్పటికీ.. ప్రమాదం ఏమీ లేదని వైద్యులు పేర్కొన్నారు. కాగా దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు రాంచీలో ప్రత్యేక సీబీఐ కోర్టు ఇవాళ ఐదేళ్ల జైలుశిక్ష, రూ.60లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే.

ఈ నెల 15న ఈ కేసులో బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి కోర్టు దోషిగా తేల్చగా.. ఇవాళ శిక్ష ఖరారు చేసింది. ఈ క్రమంలో ఆయన బ్లడ్‌ షుగర్‌, రక్తపోటు హెచ్చుతగ్గులున్నాయి. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు రిమ్స్‌ ఏడుగురు వైద్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. లాలూ మూత్రపిండాలతో పాటు పలు వ్యాధులతో బాధపడుతున్నారు. ఆయనకు కిడ్నీల వ్యాధి స్టేజీ-4లో ఉండగా.. 20శాతం సామర్థ్యతో మాత్రమే పని చేస్తున్నాయి. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు డాక్టర్‌ విద్యాపతి తెలిపారు.