Land-for-Job Scam: నితీష్ కుమార్ ప్రభుత్వానికి సీబీఐ షాక్, ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ కుంభకోణంలో ఆర్జేడీ నాయకుల ఇళ్లపై దాడులు, బలపరీక్షకు ముందే దాడులు..

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)(CBI raids) బుధవారం ఆర్జేడీ నాయకుల(RJD leaders) ఇళ్లపై దాడులు చేసింది.

CBI Raid. Representational Image. (Photo Credits: ANI)

Patna, August 24: బీహార్(Bihar) రాష్ట్రంలో రాష్ట్రీయ జనతాదళ్‌తో కలిసి నితీష్ కుమార్ నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్షకు(floor test) రెడీ అవుతున్న తరుణంలో.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)(CBI raids) బుధవారం ఆర్జేడీ నాయకుల(RJD leaders) ఇళ్లపై దాడులు చేసింది.ముగ్గురు సీనియర్‌ నేతల నివాసాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ బుధవారం తనిఖీలు చేపట్టింది.

యూపీఏ హయాంలో 2004 నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా వ్యవహరించారు.ఆ రోజుల్లో జరిగిన ‘ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌’ కుంభకోణం దర్యాప్తులో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.రైల్వేలోని వివిధ జోన్లలో ఉద్యోగాలు ఇప్పించినందుకుగాను అభ్యర్థుల నుంచి నామమాత్రపు ధరలకే వారి భూములు తీసుకున్నట్లు లాలూతోపాటు, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, ఆయన కుమార్తెలు మీసా భారతి, హేమా యాదవ్‌లపై సీబీఐ కేసులు నమోదుచేసింది. ఈ కేసులో లాలూ ఓఎస్డీగా పనిచేసిన భోలా యాదవ్‌ను సీబీఐ గత నెల అదుపులోకి తీసుకున్నది.

2024లో బీజేపీ గెలుపుపై సీఎం నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు, ప్రధానిగా తాను రేసులో ఉండనని వెల్లడి

పాట్నాలోని ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్‌ సింగ్‌ నివాసం సహా ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ అహ్మద్‌ అష్ఫాఖ్‌ కరీమ్‌, ఆర్జేడీ మాజీ ఎమ్మెల్సీ సుబోధ్‌ రాయ్‌ నివాసాల్లో ఈ సోదాలు జరిగాయి. ‘ఈ సోదాలు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు. అందులో ఎలాంటి అర్థం లేదు. భయంతో మా ఎమ్మెల్యేలు వారితో చేరతారనే కారణంగా చేస్తున్నారు.’అని పేర్కొన్నారు ఎమ్మెల్సీ సునీల్‌ సింగ్‌. ఇదే కేసులో లాలూ కుమార్తె మీసా భారతిని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

దాడులకు కొన్ని గంటల ముందు ఆర్జేడీ అధికార ప్రతినిధి సీబీఐ దాడులపై ట్వీట్‌ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. బిహార్‌లో అధికారం కోల్పోవటంపై బీజేపీ కోపంగా ఉందని, అందుకే సీబీఐ, కేంద్ర ఏజెన్సీలతో దాడులు చేపట్టేందుకు సిద్ధమైందన్నారు. బుధవారం కీలకమైన రోజుగా ఆయన పేర్కొనటం గమనార్హం.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif