Ram Temple Invitation to Uddhav: చివ‌రి నిమిషంలో ఉద్ద‌వ్ థాక్రేకు అయోధ్య రామ‌మందిర ప్రాణ‌ప్ర‌తిష్ట ఆహ్వానం, స్పీడ్ పోస్టులో పంప‌డంపై తీవ్ర అభ్యంత‌రం

మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (UBT) చీఫ్‌ ఉద్ధవ్ ఠాక్రేకు (Uddhav Thackeray) స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ కార్యక్రమం ఆహ్వానం అందింది. అయితే అయోధ్య ఉద్యమంతో సంబంధం ఉన్న ఉద్ధవ్ ఠాక్రేకు చివరి నిమిషంలో స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా ఆహ్వానం పంపడంపై ఆయన వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Uddhav Thackeray (Photo Credits: ANI)

Mumbai, JAN 21: ఉత్తరప్రదేశ్‌ అయోధ్యలోని రామ మందిరంలో ప్రతిష్టాపన (Ram Temple Event) సోమవారం జరుగనున్నది. మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (UBT) చీఫ్‌ ఉద్ధవ్ ఠాక్రేకు (Uddhav Thackeray) స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ కార్యక్రమం ఆహ్వానం అందింది. అయితే అయోధ్య ఉద్యమంతో సంబంధం ఉన్న ఉద్ధవ్ ఠాక్రేకు చివరి నిమిషంలో స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా ఆహ్వానం పంపడంపై ఆయన వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఠాక్రే కుటుంబం పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై సంజయ్ రౌత్ మండిపడ్డారు. ‘సినిమా తారలందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు. ఉద్యమంతో సన్నిహితంగా ఉన్న ఠాక్రే కుటుంబం పట్ల ఈ విధంగా వ్యవహరిస్తారు’ అని విమర్శించారు.

Ayodhya Satellite Pics: అంత‌రిక్షం నుంచి అయోధ్య ఎలా కనిపిస్తుందో తెలుసా? ఫోటోలు రిలీజ్ చేసిన ఇస్రో 

కాగా, ఉద్ధవ్ ఠాక్రే సోమవారం నుంచి రెండు రోజులు నాసిక్‌లో పర్యటించిస్తారని సంజయ్ రౌత్‌ తెలిపారు. సోమవారం కాలారం ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడంతోపాటు గోదావరి నది ఒడ్డున మహా హారతి నిర్వహిస్తారని చెప్పారు. మంగళవారం నాసిక్‌లో జరిగే పార్టీ సమావేశంలో ఉద్ధవ్‌ ఠాక్రే పాల్గొంటారని వెల్లడించారు. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రేకు స్పీడ్ పోస్ట్ ద్వారా ఆహ్వానం పంపడంపై సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన మంత్రి ఉదయ్ సామంత్ స్పందించారు. ఆహ్వానం వేగంగా చేరేందుకు స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా పంపినట్లు చెప్పారు. అది ఆయనకు అందిందని మీడియాతో అన్నారు.



సంబంధిత వార్తలు

ED Notices To KTR: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-కారు రేసు కేసులో బిగ్ ట్విస్ట్.. కేటీఆర్ కు ఈడీ నోటీసులు.. జనవరి 7వ తేదీన విచారణకు హాజరు కావాలని సమన్లు

Mother-In-Law Should Die Soon: ‘మా అత్తయ్య త్వరగా చనిపోవాలి’.. అంటూ 20 రూపాయల నోటుపై రాసి దేవుడి హుండీలో వేశారు.. ఎక్కడ?

KCR Condolence To Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి.. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని వ్యాఖ్య

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు