Ayodhya, JAN 21: అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠకు సమయం దగ్గరపడుతున్నది. వేడుర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలోనే భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఆలయానికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను విడుదల చేసింది. ఉపగ్రహాల సహాయంతో అంతరిక్షం నుంచి రామ మందిరం చిత్రాలను తీసింది. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ నుంచి తీసిన ఈ చిత్రంలో అయోధ్యలో 2.7 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. అయోధ్యలో (Ayodhya) రామమందిరం చిత్రాలను ఇస్రో గత ఏడాది డిసెంబర్ 16న తీసింది. అయితే, అప్పటి నుంచి అయోధ్యలో దట్టమైన పొగమంచు కారణంగా ఇతర ఫొటోలు తీయడం కష్టంగా మారింది. ఇస్రో తీసిన ఉపగ్రహ చిత్రాలలో దశరథ్ మహల్, సరయూ నది స్పష్టంగా కనిపించాయి.
#RamMandir from Space!@isro captures stunning satellite images of Ayodhya’s Ram Temple. The majestic Dashrath Mahal and the tranquil Saryu River take center stage in these snapshots. Notably, the recently revamped Ayodhya railway station stands out prominently in the detailed… pic.twitter.com/4Sn4R3JaZH
— MyGovIndia (@mygovindia) January 21, 2024
అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ సైతం స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం భారతదేశం అంతరిక్షంలో 50కిపైగా ఉపగ్రహాలున్నాయి. హైదరాబాద్‌లోని ఇండియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుంచి చిత్రాలను ఇస్రో క్లిక్‌మనిపించింది. విశేషమేమిటంటే, రామ మందిర నిర్మాణంలో అనేక దశల్లో ఇస్రో సాంకేతికతను సైతం ఉపయోగించారు.
రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఖచ్చితమైన స్థలాన్ని ఎంచుకోవడం పెద్ద సవాల్ కాగా.. కానీ రాముడు జన్మించిన గర్భగుడి లోపల 3X6 అడుగుల స్థలంలో విగ్రహాన్ని ఉంచేందుకు ట్రస్ట్ నిర్ణయించింది. ఇందుకు ఇస్రో సహాయం కోరగా.. ఇస్రో డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ సాంకేతికను వినియోగించింది. గర్భగుడి లోపల ఈ ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించడానికి, నిర్మాణ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రోకు చెందిన కాంట్రాక్టర్లు అత్యంత అధునాతన జీపీఎస్ ఆధారిత కోఆర్డినేట్‌లను వినియోగించారు. ఇందుకు సుమారు 1-3 సెంటీమీటర్ల ఖచ్చితమైన కోఆర్డినేట్లు తయారు చేశారు. ఇదే ఆలయ గర్భగుడిలో విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఆధారం కావడం విశేషం.