IPL Auction 2025 Live

Delhi: అర‌వింద్ కేజ్రీవాల్ ఉగ్ర‌వాదుల‌కు స‌హ‌క‌రించారు! ఎన్ఐఏ తో ద‌ర్యాప్తు చేయించాలంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ లేఖ‌

ఉగ్రవాది దేవేంద్ర పాల్ భుల్లర్‌ను విడుదల చేయడానికి, దేశంలో ఖలిస్థానీ అనుకూల భావాలను ప్రోత్సహించడానికి వాంటెడ్ టెర్రరిస్ట్ గురుపత్వంత్ పన్నూన్ స్థాపించిన నిషేధిత ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాద సంస్థ ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)కు 16 మిలియన్‌ డాలర్లు అందాయని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆ లేఖలో ఆరోపించారు.

LG VK Saxena & Kejriwal (PIC @ X)

New Delhi, May 06: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే  (LG VK Saxena) సోమవారం మరో బాంబు పేల్చారు. నిషేధిత ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాద సంస్థ ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ (Sikhs for Justice) నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP)కు నిధులు అందాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై (Arvind Kejriwal) జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)తో దర్యాప్తు జరిపించాలని కేంద్రానికి సిఫార్సు చేశారు. కేంద్ర హోం కార్యదర్శికి ఈ మేరకు లేఖ రాశారు.

 

కాగా, ఉగ్రవాది దేవేంద్ర పాల్ భుల్లర్‌ను విడుదల చేయడానికి, దేశంలో ఖలిస్థానీ అనుకూల భావాలను ప్రోత్సహించడానికి వాంటెడ్ టెర్రరిస్ట్ గురుపత్వంత్ పన్నూన్ స్థాపించిన నిషేధిత ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాద సంస్థ ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP)కు 16 మిలియన్‌ డాలర్లు అందాయని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆ లేఖలో ఆరోపించారు. దీని గురించి పన్నూన్ మాట్లాడిన వీడియో క్లిప్‌ను ఆ లేఖకు జత చేశారు. ఈ ఆరోపణలు, ఫిర్యాదులపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఎన్‌ఐఏతో విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. మరోవైపు ఇప్పటికే మద్యం పాలసీ కేసులో అరెస్టైన కేజ్రీవాల్, తీహార్‌ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.