Lok Sabha Elections 2024 Phase 7: రేపే ఆఖరి దశ పోలింగ్, మొత్తం 57 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్, అదే రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదల
చివరి విడతలో ఏడు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతంలో 57 లోక్ సభ నియోజకవర్గాల్లో జూన్ 1న పోలింగ్ జరగనుంది.
New Delhi, May 30: భారత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏడోదైన చివరి విడత లోక్ సభ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. చివరి విడతలో ఏడు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతంలో 57 లోక్ సభ నియోజకవర్గాల్లో జూన్ 1న పోలింగ్ జరగనుంది. బీహార్ (8), హిమాచల్ ప్రదేశ్ (4), ఝార్ఖండ్ (3), ఒడిశా (6), పంజాబ్ (13), ఉత్తర ప్రదేశ్ (13), పశ్చిమ బెంగాల్ (9) రాష్ట్రాలలో పోలింగ్ జరగనుంది. చండీగఢ్‌లోనూ పోలింగ్ జరగనుంది. ఇప్పటివరకు జరిగిన ఆరు దశల్లో 486 లోక్‌సభ సీట్లకు పోలింగ్ ముగిసింది.
ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్‌లో 13 చొప్పున, పశ్చిమబెంగాల్‌లో తొమ్మిది, బిహార్‌లో ఎనిమిది, ఒడిశా ఆరు, హిమాచల్ ప్రదేశ్‌లో నాలుగు, ఝార్ఖండ్‌లో మూడు, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ లోక్‌సభ స్థానానికి శనివారం పోలింగ్ నిర్వహించనున్నారు. వీటితోపాటు ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకూ అదేరోజు ఓటింగ్ జరగనుంది. జూన్ 4 కౌంటింగ్ ఉంటుంది. జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్ ఫలితాలు, ఈసీ ట్వీట్ ఇదిగో..
చివరి విడతలో పలు కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. వారణాసి నుంచి ప్రధాని మోదీ, మండి నుంచి బీజేపీ అభ్యర్థిగా కంగనా రనౌత్, హామిపూర్ నుంచి కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, గోరక్‌పూర్ నుంచి నటుడు రవికిషన్, డైమండ్ హార్బర్ నుంచి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీలో ఉన్నారు.
తుది విడత పోలింగ్ శనివారంతో ముగియనుండడంతో అదే రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ (exit polls) అంచనాలు వెలువడనున్నాయి. లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు సంబంధించి ప్రముఖ మీడియా/ ప్రైవేటు సంస్థలు సాయంత్రం 6.30 గంటల తర్వాత ఈ అంచనాలను వెలువరించనున్నాయి. తుది ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి.