Fuel Prices Hike: మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, వంటగ్యాస్‌పై కూడా రూ. 25 పెంపు, దిల్లీలో రూ.719కి చేరిన ఎల్పీజీ సిలిండర్ ధర

Representational Image | (Photo Credits: PTI)

New Delhi, February 4: పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. ముడి చమురు రేట్ల నేపథ్యంలో ప్రభుత్వ చమురు కంపెనీలు ఈ రోజు ధరలను పెంచాయి. క్రింద పేర్కొన్న ఇంధన రేట్లు గురువారం ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వచ్చాయి. పెట్రోలియం కంపెనీల ప్రకారం ధరల్లో మార్పులు ఎప్పడైనా సమీక్షించుకోవచ్చు.

తాజాగా పెట్రోలు మరియు డీజిలుపై 35 పైసల చొప్పున పెంపుతో దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 86.65కు చేరగా, లీటరు డీజిల్ ధర 76.83 కు చేరింది. హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ పెట్రోల్ ధర రూ. 90.10కు చేరగా, డీజిల్ ధర రూ. 83.81కు చేరింది. అలాగే చెన్నైలో పెట్రోల్ ధరపై లీటరుకు రూ. 22 పైసల పెంపుతో పెట్రోల్ రూ.89.13/లీ, డీజిల్ ధరపై రూ. 24 పైసల పెంపుతో 82.04/లీ. అయింది.

అటు ఆర్థిక రాజధాని ముంబైలో సైతం పరిస్థితి అదే విధంగా ఉంది, లీటరుకు పెట్రోల్ ధరపై 34 పైసల పెరుగుదలతో పెట్రోల్ రూ. 93.20/ లీ, డీజిల్ ధరలపై 37 పైసల పెంపుతో రూ. 83.67/లీ కు చేరుకున్నాయి.

ఇంధన ధరల పెరుగుదలతో ఎల్పీజీ సిలిండర్ ధరలు కూడా పెరిగాయి.  ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీ రాయితీ లేని సిలిండర్‌పై రూ.25 పెంచింది. తాజా పెంపుతో దేశ రాజధాని దిల్లీలో ఒక్కో సిలిండర్‌ ధర రూ.719కు చేరింది. ఈ పెరిగిన ధరలు వెంటనే అమలులోకి వస్తాయని ఇంధన కంపెనీలు ప్రకటించాయి.