IPL Auction 2025 Live

Madhra Pradesh: ప్రేమికులను దారుణంగా హింసించిన గ్రామస్థులు, మెడలో స్కూటర్‌ టైర్‌ వేసి డ్యాన్స్‌ చేయాలని ఒత్తిడి, ఐదుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

ప్రేమించి.. పెళ్లి చేసుకోవాలని భావించి ఇంటి నుంచి పారిపోయిన ఓ ప్రేమ జంటను గ్రామస్థులు దారుణంగా హింసించారు . స్కూటర్‌ టైర్‌ మెడలో వేసి.. డ్యాన్స్‌ చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

Couple forced to dance with tyres, beaten for eloping in MP (Photo-Video Grab)

Bhopal, Sep 22: మధ్యప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి.. పెళ్లి చేసుకోవాలని భావించి ఇంటి నుంచి పారిపోయిన ఓ ప్రేమ జంటను గ్రామస్థులు దారుణంగా హింసించారు . స్కూటర్‌ టైర్‌ మెడలో వేసి.. డ్యాన్స్‌ చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌ (Madhra Pradesh) ధార్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ధార్‌ ప్రాంతంలోని కుండి గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి అదే ఊరికి చెందిన 23 ఏళ్ల వ్యక్తి ప్రేమించుకున్నారు. పెద్దలు తమ పెళ్లికి అంగీకరించకపోవడంతో ఈ నెల మొదటి వారంలో ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో యువతి కుటుంబ సభ్యులు మిస్సింగ్‌ కంప్లైంట్‌ ఇచ్చారు. వారం రోజుల అనంతరం వారు గ్రామానికి తిరిగి వచ్చారు. ప్రేమికుల ప్రవర్తనపట్ల ఆగ్రహంగా ఉన్న గ్రామస్తులు వారి చేసిన పనికి తగిన శిక్ష (Beaten for eloping in MP) విధించాలని భావించారు.

విశాఖలో ఊహకందని మిరాకిల్, గోదావరి నదీ ప్రమాదంలో తమ ఇద్దరు పిల్లలు చనిపోయిన రోజే ట్విన్స్‌కు జన్మనిచ్చిన తల్లి, ఆశ్చర్యపోతున్న వైద్యులు

రచ్చబండ వద్దకు వారిని పిలిపించారు. అనంతరం గ్రామ పెద్దగా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి.. ఆ జంటను కర్రతో పలు మార్లు కొట్టాడు. అనంతరం వారి మెడలో స్కూటర్‌ టైర్‌ వేసి డ్యాన్స్‌ (Couple forced to dance with tyres) చేయించారు. ఈ ప్రేమ జంటకు సాయం చేసిందనే ఆరోపణలతో 13 ఏళ్ల బాలికను కూడా ఇదే విధంగా హింసించారు. గ్రామస్తుల్లో కొందరు ఈ తతంగాన్ని వీడియో తీసి.. సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఇది వైరలయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. ప్రేమికుల మీద దాడి చేసిన వారిలో ఐదుగురిని అరెస్ట్‌ చేశారు.



సంబంధిత వార్తలు

Sambhal Shahi Jama Masjid Survey: యూపీలో మసీదు సర్వే కోసం వచ్చిన అధికారులపై రాళ్లు రువ్విన స్థానికులు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు, వీడియోలు ఇవిగో..

Hospital Horror: కంటిలో నలక పడిందని వస్తే, సర్జరీ అన్నారు.. మత్తు ఇంజక్షన్ ఇచ్చి చిన్నారిని పొట్టనబెట్టుకున్నారు.. హైదరాబాద్ లో ప్రైవేటు కంటి దవాఖాన ముందు బంధువుల ఆందోళన (వీడియో)

Andhra Pradesh Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, మొత్తం 21 బిల్లులు ఆమోదం, 10 రోజుల పాటు 59 గంటల 55 నిమిషాల పాటు సభా కార్యకలాపాలు

Andhra Pradesh Assembly Session: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు, కీలక బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం, అనంతరం నిరవధిక వాయిదా