Representational Image (Photo Credits: Pixabay)

Visakhapatnam, September 19: విశాఖలో అమ్మకు దూరమైన ఇద్దరు చిన్నారులు సరిగ్గా వాళ్ళు చనిపోయిన రోజు, అదే సమయంలోనే జన్మించారు. మళ్ళీ తమ పిల్లలే తిరిగి పుట్టారని (Andhra Pradesh Couple Blessed With Twin Daughters) తల్లిదండ్రులు సంతో షంలో వుంటే.. వైద్యులకు మాత్రం ఇది మిరాకిల్ గానే కనిపిస్తోంది. సెప్టెంబరు 15, 2019.. గోదావరి నదీ ప్రమాదాల్లో అతిపెద్ద విషాదం చోటు చేసుకున్న సంగతి విదితమే. వశిష్ట బోటు కచ్చులూరు సమీపంలో గోదావరి నదిలో (Godavari Boat Mishap) మునిగిపోయింది. రాజమండ్రి నుంచి భద్రాచలం బయలుదేరిన వశిష్ఠ బోటు గోదావరి నదిలో మునిగిపోయింది. దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 50 మందికి పైగా జలసమాధి అయ్యారు.

ఈ ప్రమాదంలో విశాఖకు చెందిన 3 ఏళ్ల గీతావైష్ణవి, 18 నెలల ధాత్రి అనన్య మృతి (They Lost Twin Daughters in Godavari Boat Mishap)చెందారు. బంగారు బొమ్మల్లాంటి పిల్లలను పోగొట్టుకున్న భాగ్యలక్ష్మి, అప్పలరాజు దంపతులకు భవిష్యత్తు అంధకారంగా కనిపించింది. అప్పటికే భాగ్యలక్ష్మి ట్యూబెక్టమీ ఆపరేషన్‌ చేయించుకుంది. దీంతో ఇక పిల్లలు పుట్టరని కుంగిపోయారు. మళ్లీ పిల్లలు కావాలనే కోరికతో విశాఖలో ఓ ఐవీఎఫ్ సెంటర్ వైద్యులను సంప్రదించారు. కృత్రిమ గర్భధారణ విధానం ద్వారా భాగ్యలక్ష్మికి మళ్ళీ ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు.

తాళి కట్టిన తరువాత డబ్బు, నగలతో వధువు పరార్, వరుడు నచ్చలేదని అందుకే నా లవర్‌తో లేచిపోతున్నానంటూ అమ్మమ్మకు ఫోన్, ఆందోళనకు దిగిన పెళ్లి కొడుకు తరపు బంధువులు

అయితే ఇదే రోజు ప్రమాదంలో ఇద్దరు ఆడపిల్లల్ని కోల్పోగా రెండు సంవత్సరాలు తర్వాత ఇదే రోజు భాగ్యలక్ష్మి ట్విన్స్ కు జన్మనిచ్చింది. ప్రమాదం జరిగిన రోజే కవలలు పుట్టడంతో ఇది దేవుడిచ్చిన వరమే అంటున్నారు దంపతులు. రెండేళ్ల క్రితం బోటు ప్రమాదంలో ఏ రోజేతై ఇద్దరు ఆడపిల్లలను కోల్పోయారో... సరిగ్గా అదే రోజున ఆ దంపతులకు ఇద్దరు ట్విన్స్‌ పుట్టడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

37 రోజుల తర్వాత బయటపడిన రాయల్ వశిష్ట, సెప్టెంబర్ నెలలో గోదావరి నదిలో మునిగిపోయిన బోటు వెలికితీత, మృతదేహాల కోసం ఆత్మీయుల ఎదురుచూపులు

కాగా కచ్చులూరు ప్రమాదం బంధువులందర్నీ కోల్పోయాక తమకు దేవుడిపై నమ్మకం పోయిందని అప్పలరాజు భార్య తెలిపారు. పిల్లలు చనిపోయాక నరకం అనుభవించామన్నారు. ఇద్దరు పిల్లల్ని కోల్పోయిన రోజునే మళ్లీ ఇద్దరు కవలలకు జన్మనివ్వడం నిజంగా ఆ దేవుడి మహిమేనని భావిస్తున్నామన్నారు. ఆ ఇద్దరు పిల్లలు మళ్లీ పుట్టారని అందుకే వాళ్లకు గీతావైష్ణవి, ధాత్రి అనన్య పేర్లు పెడతామంటున్నారు. పిల్లలు పెద్దయ్యాక మళ్లీ భద్రాచలం సీతారాముల దర్శనానికి వెళ్తామని తెలిపారు. భాగ్యలక్ష్మికి ఈ నెల 20వ తేదీ డెలివరీ డేట్ అని వైద్యులు తెలిపారు కానీ ఆమెకు 15వ తేదీనే ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయని వైద్యులు తెలిపారు.

గోదావరిలో బోటు ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాద తీవ్రత ఎంత? వరద సమయంలో బోటుకు అనుమతి ఎలా ఇచ్చారు? ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు..

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలోని కచ్చులూరు వద్ద బోటు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఏపీ, తెలంగాణకు చెందిన వారు మృతిచెందారు. ఈ ప్రమాదం నుంచి 26 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పటివరకు 39 మంది మృతదేహాలు బయటకు తీశారు. మరో 12 మంది ఆచూకీ మాత్రం ఈ రోజు వరకు దొరకలేదు.