Maharashtra: ముంబైలో ప్రముఖ బిల్డర్ 23వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, వ్యక్తిగత సమస్యల కారణంగా సూసైడ్ చేసుకున్నట్లుగా అనుమానాలు

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రముఖ బిల్డర్‌ పరాస్ పోర్వాల్ (Builder Paras Porwal dies) ఆత్మహత్య చేసుకున్నాడు.ఉదయం 6 గంటల సమయంలో 23వ అంతస్తు నుంచి దూకి బలవన్మరాణానికి (Paras Porwal dies by suicide) పాల్పడ్డాడు.

Representational Image (Photo Credits: File Image)

Mumbai, Oct 20: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రముఖ బిల్డర్‌ పరాస్ పోర్వాల్ (Builder Paras Porwal dies) ఆత్మహత్య చేసుకున్నాడు.ఉదయం 6 గంటల సమయంలో 23వ అంతస్తు నుంచి దూకి బలవన్మరాణానికి (Paras Porwal dies by suicide) పాల్పడ్డాడు. ముంబై చించ్‌పోక్లీ రైల్వే స్టేషన్‌ సమీపంలోని శాంతి కమల్ హౌసింగ్ సొసైటీలో ఈ ఘటన జరిగింది.

తన నివాసంలో జిమ్‌ బాల్కనీ నుంచి పరాస్ దూకినట్లు తెలుస్తోంది. అయితే తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, ఎవరినీ విచారించవద్దని ఆయన ఆత్మహత్య లేఖలో పేర్కొన్నారు. పోలీసులు ఈ లేఖను పరాస్ జిమ్‌లో స్వాధీనం చేసుకున్నారు. పరాస్ కిందకు దూకిన వెంటనే అటువైపు నుంచి వెళ్తున్న ఒకరు చూసి పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌ సిబ్బంది నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

తాగిన మత్తులో కానిస్టేబుల్‌పై గొడ్డలితో దాడి చేసిన మందుబాబు, తెలంగాణలో దారుణ ఘటన, నిందితుడిని అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు

ఆయన బలవన్మరణానికి ఎందుకు పాల్పడ్డారనే విషయంపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.వ్యక్తిగత సమస్యల కారణంగా పోర్వాల్ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నట్లు అడిషనల్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్ రీజియన్) జ్ఞానేశ్వర్ చవాన్ తెలిపారు.ముంబైలోని పరేల్, చించ్‌పోక్లి మరియు బైకుల్లా ప్రాంతాల్లోని పాత భవనాల పునరాభివృద్ధి ప్రాజెక్టులను పోర్వాల్ చేపట్టారు.