Amruta Fadnavis Photos With Reptiles: పాములతో ఫోజులిచ్చిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం భార్య, మనుషులే అత్యంత విషపూరితమైన జంతువులంటూ కామెంట్

ఈ పోస్టులో ఆమె పాములు, బల్లులతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తు ఈ కొటేషన్ పెట్టారు.

Amruta Fadnavis Photos With Reptiles

Mumbai, July 15: ‘అత్యంత క్రూరమైన, విషపూరితమైన జంతువులు మనుషులు మాత్రమే’ అంటూ మహారాష్ట్ర (Maharashtra) డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Deputy CM Devendra Fadnavis)భార్య అమృతా ఫడ్నీవీస్ (Amruta Fadnavis) ట్విట్టలో పోస్ట్ చేశారు. ఈ పోస్టులో ఆమె పాములు, బల్లులతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తు ఈ కొటేషన్ పెట్టారు. అమృత ఫడ్నవీస్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత భారతీయ బ్యాంకర్,గాయని, సామాజిక కార్యకర్త కూడా. యాక్సిస్ బ్యాంక్‌లో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. బ్యాంకర్‌గా..ఆమె గత 17 సంవత్సరాల నుండి యాక్సిస్ బ్యాంక్‌లో పని చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాషియర్‌గా చేరిన ఆమె ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ డిపార్ట్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు.

Man Urinates On Dalit: దళితుడి చెవిలో మూత్రం పోసిన వ్యక్తి, ఫుల్లుగా మద్యంతాగి పైశాచిక పని, మధ్యప్రదేశ్ ఘటన మరువకముందే ఉత్తరప్రదేశ్‌లో దారుణం 

ఆమె భర్త మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా యాక్సిస్ బ్యాంక్‌లో పని చేయడం కొనసాగించారు. ఇన్ని బాధ్యతలు నిర్వహిస్తు కూడా అమృత తనలోని సామాజిక కోణాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోరు. తరచు వాటికి సంబంధించి పోస్టులు పెడుతుంటారు. వివిధ అంశాల గురించి పోస్టులు పెడుతుంటారు. ఈ క్రమంలో ఆమె షేర్ చేసిన చిత్రాలతో ఆశ్చర్యపర్చారు.

ఏమాత్రం భయపడకుండా చేతుల్లో పాములు, బల్లిని పట్టుకొని ఫొటోలు దిగారు. ‘అత్యంత క్రూరమైన, విషపూరితమైన జంతువులు మనుషులు మాత్రమే’ అంటూ ఆమె రాసుకొచ్చారు. ఈ ఫోటోలో అమృతా ఫడ్నవీస్ ఒక చేతిలో ఒక పాము, రెండో చేతిలో మరో పాముతో ఉన్నారు. మరో ఫోటోలో ఓ బల్లిని చేతిపై ఉంచుకుని దానివైపు ప్రేమగా చూస్తున్నట్లుగా ఉంది. ఈ చిత్రాలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో కనిపిస్తున్నది ఇదేనంటూ ఒకరు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.



సంబంధిత వార్తలు

Eknath Shinde: మహారాష్ట్ర సీఎం పదవిపై ఫిటింగ్ పెట్టిన ఏక్‌నాథ్ షిండే...సీట్లకు సీఎం పదవికి సంబంధం లేదని కామెంట్, ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని లేదని వెల్లడి

ISRO To Launch Falcon 9 Rocket: స్పేస్ ఎక్స్ తో ఇస్రో భాగ‌స్వామ్యం, ఫాల్కన్-9 ద్వారా జీశాట్ ఉప‌గ్ర‌హాన్ని మోసుకెళ్ల‌నున్న సంస్థ‌

KTR: కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తారని ప్రచారం?, భారీగా కేటీఆర్‌ ఇంటికి బీఆర్ఎస్ నేతలు, ఎవనిదిరా కుట్ర..ఏంది ఆ కుట్ర? అని మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,నిజానికి ఉన్న దమ్మేంటో చూద్దామని సవాల్

HC on Social Media Post Cases: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిపై కేసులు, కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు, జడ్జిలను కూడా దూషిస్తూ పోస్టులు పెట్టారని ఆగ్రహం